రామ్ చరణ్- పవన్ కళ్యాణ్  కలిసి మల్టీస్టారర్ చేయడమనేదే బిగ్ న్యూస్. అలాంటిది ఈ క్రేజీ కాంబినేషన్ కి దర్శకుడుగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఉంటే... ఇక ఆ అంచనాలు, హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించే ఈ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుండగా దాదాపు ఖాయమే అంటున్నారు. భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న శంకర్... పవన్- చరణ్ లతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడట. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఆయన సిద్ధం చేశారట. 

భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో చరణ్ మెయిన్ లీడ్ చేస్తారట. ఇక పవన్ ప్రాధాన్యం ఉన్న నిడివి కలిగిన పాత్రలో కనిపిస్తారట. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి సర్వం సిద్ధం కాగా పవన్ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నారట. ఆయన స్క్రిప్ట్ చదివి ఒకే అంటే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట. 

రామ్ చరణ్ మరో వైపు ఆర్ ఆర్ ఆర్ తరువాత చేయనున్న ప్రాజెక్ట్ ప్రకటించలేదు . దీనితో శంకర్ ప్రాజెక్ట్ చేయడం కోసం మిగతా దర్శకులు ఎవ్వరికీ ఆయన కమిట్ కాలేదన్న వార్త వినిపిస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కనుక ఒకే అయితే... ఆర్ ఆర్ ఆర్ తరువాత సౌత్ ఇండియాలో తెరకెక్కే అత్యంత భారీ చిత్రంగా ఇది నిలుస్తుంది. ఎప్పటి నుండో మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ మల్టీస్టారర్ తెరకెక్కితే ఫ్యాన్స్ కి పండగే.