కరోనా వైరస్‌ ప్రభావం వినోద రంగం మీద కూడా భారీ స్థాయిలో ఉంది. ఇప్పటికే సినిమాలు సీరియల్స్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. లాక్‌ డౌన్‌ సడలింపులతో కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పటికే సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో కొద్ది మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్‌ అయ్యాయి. అయితే ఈ పరిస్థితులపై సౌత్‌ గ్రేట్‌ డైరెక్టర్ శంకర్ స్పందించాడు. ఒకవేళ సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్ చేయాల్సి వస్తే నేను సినిమాలు చేయటం మానేస్తాననంటూ సంచలన ప్రకటన చేశాడు శంకర్. కొంతకాలంగా శంకర్‌ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కావటం లేదు. ఐ సినిమా తరువాత శంకర్‌ తెరకెక్కించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం శంకర్‌ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్, కమల్‌ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్ సింగ్‌, సిద్ధార్థ్‌లు కీలక పాత్రల్లో  నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు వరుసగా అడ్డంకులు ఎదరువుతున్నాయి. ఆర్థిక సమస్యల కారణంగా చాలా కాలం వాయిదా పడ్డ ఈ సినిమా తరువాత ప్రమాదం కారణంగా మరోసారి వాయిదా పడింది.

తాజాగా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ మరోసారి ఆగిపోవటంతో శంకర్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. దీంతో డైరెక్ట్‌ ఓటీటీపై ఘాటుగా స్పందించాడు శంకర్‌. భారీ బడ్జెట్‌తో గ్రాఫిక్స్‌, సెట్స్‌ నేపథ్యంలో తెరకెక్కే తన సినిమాలను డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వస్తే తాను సినిమాలు తీయటం మానేస్తానని సంచలన ప్రకటన చేశాడు శంకర్.