చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు తుదిశ్వాస విడిచారు. తమిళ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్(90) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం చెన్నైలో మరణించారు.
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు తుదిశ్వాస విడిచారు. తమిళ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్(90) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం చెన్నైలో మరణించారు. కొంతకాలంగా సేతు మాధవన్ వయసు రీత్యా వచ్చిన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.
సేతు మాధవన్ మలయాళీ దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత మళయాళంతో పాటు తమిళ , కన్నడ, హిందీ భాషల్లో కూడా చిత్రాలు తెరకెక్కించారు. తెలుగులో సేతు మాధవన్ 1995లో స్త్రీ చిత్రానికి దర్శకత్వం వహించారు. సేతు మాధవన్ 1961లో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. 60 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఆయన దర్శకుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. సేతుమాధవన్ పనిచేసిన దాదాపు 10 చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కాయి. 1990లో ఆయన తెరకెక్కించిన మరుపక్కం అనే చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో కూడా ఆ చిత్రానికి అవార్డు దక్కించింది.
తెలుగులో ఆయన తెరకెక్కించిన స్త్రీ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిలిం గా జాతీయ అవార్డు అందుకుంది. ఇక సేతు మాధవన్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. లోకనాయకుడు కమల్ హాసన్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం చేసింది ఈ దర్శకుడే. తనని వెండితెరకు పరిచయం చేసిన సేతు మాధవన్ మృతికి కమల్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
సేతు మాధవన్ 1931లో కేరళలో పాలక్కడ్ లో జన్మించారు. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్, ఉమ, సంతోష్ సేతు మాధవన్ ఉన్నారు. సేతు మాధవన్ మృతితో మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Samantha Meets Hrithik Roshan: హృతిక్ రోషన్ ను కలిసిన సమంత.. సినిమా చేయబోతున్నారా..?
