దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల 'ఫిదా' సినిమాతో భారీ హిట్ ని అందించాడు. 2016 లో విడుదలైన ఈ సినిమా నలభై కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇటీవల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. 

సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా శేఖర్ కమ్ముల రూ.7 కోట్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇక్కడ షాకింగ్ విషయమేమిటంటే.. ఈ సినిమా బడ్జెట్ రూ.4 కోట్లు మాత్రమే.. సినిమా బడ్జెట్ కంటే శేఖర్ కమ్ముల ఎక్కువ పారితోషికం తీసుకుంటుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయనకి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కారణం 'ఫిదా' సినిమా అనే చెప్పాలి.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. మార్కెట్ లో శేఖర్ కమ్ములు డిమాండ్ కూడా పెరిగింది. ఆ కారణంగానే ఆయనకి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందించారు. అందరూ కొత్తవాళ్లతో రూపొందిస్తోన్న ఈ సినిమాతో మరోసారి శేఖర్ కమ్ముల హిట్ అందుకుంటాడని నమ్మకంగా చెబుతున్నారు.