కెరీర్ పరంగా పడిపోయిన ఓ క్రీడాకారుడు ఆకాశంలోకి దూసుకెళ్లడానికి ఎలాంటి పరిస్థితులు పురిగొల్పాయి అనే విషయాన్ని సినిమాలో చూపించబోతున్నట్టు చెప్పారు `లక్ష్య` మూవీ దర్శకుడు సంతోష్ జాగర్లపుడి.
`లక్ష్య`(Lakshya) మూవీ ఒక రివేంజ్ డ్రామా. ఓ క్రీడాకారుడి ఎమోషనల్ జర్నీ. పాతాళంలోకి పడిపోయిన ఓ క్రీడాకారుడు పడి లేచిన కెరటంలా ఎలా దూసుకొచ్చాడు. అందుకు దారి తీసిన అంశాలేంటనేది తెలియాలంటే `లక్ష్య` చిత్రం చూడాల్సిందే` అంటున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపుడి. నాగచైతన్య, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం lakshya Movie. సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు శుక్రవారం(డిసెంబర్ 10)న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంతోష్ జాగర్లపుడి మీడియాతో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సినిమా గురించి చెబుతూ, కెరీర్ పరంగా పడిపోయిన ఓ క్రీడాకారుడు ఆకాశంలోకి దూసుకెళ్లడానికి ఎలాంటి పరిస్థితులు పురిగొల్పాయి అనే విషయాన్ని సినిమాలో చూపించబోతున్నట్టు చెప్పారు దర్శకుడు. `ఒక క్రీడాకారుడి జీవితంలో గెలుపు ఓటములు అనేది సహజం. అలాంటి విషయాలను చెబుతూనే కొన్ని ఎమోషనల్ పాయింట్స్‌తో సినిమాను తెరకెక్కించాం. తెర మీద ఆర్చరీ అనేది ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది. ప్రతీ ఎమోషన్ ప్రేక్షకుడి హృదయాన్ని టచ్ చేస్తుందన్నారు.
`లక్ష్య` సబ్జెక్ట్ కోసం చాలా రీసెర్చ్ చేశాం. పలువరు స్పోర్ట్స్ పర్సన్ కలిశాం. ఈ క్రీడా తెరమీద కొత్తగా కనిపిస్తుంది. ఇది రివేంజ్ డ్రామా కాదు. ఓ క్రీడాకారుడి ఎమోషనల్ జర్నీని తెలియజేస్తుంది. ఇందులో నాగశౌర్య .. పార్ధు పాత్రలో కనిపిస్తాడు. నాగశౌర్యను ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా చూపించారు. కానీ లక్ష్య సినిమాలో ఒక కొత్త నాగశౌర్యను చూస్తారు. ఎనిమిది పలకలా దేహంతో కనిపిస్తాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్, అతడి బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. చూడటానికి యువ మునిలా కనిపిస్తాడు. కేవలం గోల్డ్ మెడల్ కోసం పోరాడే ఆటగాడు మాత్రమే కాదు, అంతకు మించిన ఓ బలమైన పాయింట్‌ని ఇందులో చర్చించబోతున్నాం` అని చెప్పారు దర్శకుడు.
కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చెప్పారు సంతోష్ జాగర్లపుడి. ఒక అంధుడైన జగపతి బాబు నాగశౌర్యను టాప్ విలువిద్య క్రీడాకారుడిగా ఎలా మలిచాడు. నాగశౌర్యనే ఎందుకు జగపతి బాబు ఎంచుకొన్నాడనే విషయాలు సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. జగపతి బాబు పాత్ర పేరు పార్థసారథి. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని పాత్రలో జగపతిబాబు కనిపిస్తాడు. సినిమాకు వెన్నముకగా జగపతి బాబు పాత్ర ఉంటుందన్నారు. సచిన్ ఖేడేకర్ రోల్ `
లక్ష్య` సినిమాలో మరో ట్విస్ట్. తాతయ్య సెంటిమెంట్‌తో అంతర్లీనంగా కథ సాగుతుంది. సచిన్ ఖేడేకర్ పాత్ర సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చుతుంది.
హీరోయిన్‌గా కేతిక శర్మ పాత్రకి చాలా ప్రయారిటీ ఉంటుంది. గ్లామర్ హీరోయిన్ కాకుండా కొత్త రకమైన ఎమోషనల్ పాత్రలో నటించారు. ఆమె నటనకు మంచి మార్కులు పడతాయి. కాలభైరవ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు. ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందిస్తుందని, కచ్చితంగా నచ్చేచిత్రమవుతుందని చెప్పారు. ఓ కొత్త రకమైన క్రీడా సినిమాని చూడొచ్చని చెప్పారు దర్శకుడు.
also read: చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన `బిగ్‌బాస్ 5` ఫేమ్ లోబో..
