ప్రభాస్-సందీప్ రెడ్డి కాంబోలో స్పిరిట్ టైటిల్ తో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని ఉద్దేశిస్తూ సందీప్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అర్జున్ రెడ్డి మూవీతో సందీప్ రెడ్డి వంగా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి ఒక సంచలనం. అదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి మరో భారీ హిట్ కొట్టాడు. షాహిద్ కపూర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా కబీర్ సింగ్ నిలిచింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. మూడో ప్రాజెక్ట్ గా సందీప్ యానిమల్ చేస్తున్నారు. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా... రష్మిక మందాన హీరోయిన్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.
కాగా ప్రభాస్ తో సందీప్ రెడ్డి రెండేళ్ల క్రితం స్పిరిట్ ప్రకటించారు. మరలా ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ లేదు. స్పిరిట్ కంటే వెనుక ప్రకటించిన చిత్రాలు కూడా సెట్స్ పైకి వెళుతున్నాయి. సందీప్ రెడ్డి యానిమల్ షూట్లో బిజీగా ఉన్నారు. దీంతో దర్శకుడు మారుతితో ప్రభాస్ రాజా డీలక్స్ కి ఓకే చెప్పాడు. స్పిరిట్ తర్వాత సైన్ చేసిన రాజా డీలక్స్ షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి స్పిరిట్ పై స్పందించారు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ... యానిమల్ అనంతరం స్పిరిట్ ఉంటుంది. ప్రభాస్ అన్న అనగానే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు అందుకునేలా మూవీ ఉంటుంది. అందుకు కృషి చేస్తాము.. అని సమాధానం చెప్పారు. అసలు స్పిరిట్ ఉందా? లేదా? అనే సందేహాలు ఉండగా ఓ క్లారిటీ వచ్చింది.
ఈ ఏడాది ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ విడుదల కానున్నాయి. నెలల వ్యవధిలో ఈ రెండు చిత్రాల విడుదల ఉంది. ఇక రాజా డీలక్స్, ప్రాజెక్ట్ కే వచ్చే ఏడాది విడుదలయ్యే సూచనలు కలవు. ప్రాజెక్ట్ కే కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా కష్టపడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రాజెక్ట్ కే తెరకెక్కనుంది. ఇక దర్శకుడు మారుతీతో చేస్తున్న చిత్రం హారర్ కామెడీ అంటున్నారు. ఓ పాత థియేటర్లో సినిమా మొత్తం నడిపించేస్తారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
