డబ్బు విషయంలో మోసం చేయడంతో సినీ దర్శకుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి పులల్ జైలుకి తరలించారు. వివరాల్లోకి వెళితే 'కమరకట్టు' అనే చిత్ర దర్శకుడు రాంకీ రామకృష్ణన్.. నర్తకి దర్శకురాలు విజయపద్మ, ఆమె భర్త ముత్తుకృష్ణన్ లతో కలిసి 'ఇదయం తిరైయరంగం' అనే సినిమా నిర్మాణం చేపట్టారు.

దీనికోసం శావుకార్ పేటకు చెందిన అశోక్ అనే ఫైనాన్షియర్ వద్ద అప్పుగా కొంతడబ్బుని తీసుకున్నారు. దానికి బదులుగా ఆస్తుల పట్టాలను కుదవ పెట్టారు. అయితే చెప్పిన తేదీకి తీసుకున్న డబ్బు రూ.4.60 లక్షలు తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ అశోక్ కోర్టుని ఆశ్రయించారు.

కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శకుడు రాంకీ రామకృష్ణన్, విజయ పద్మ, ఆమె భర్త ముత్తుకృష్ణన్ లను బుధవారం నాడు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.