రామ్ గోపాల్ వర్మ మేన మామ మురళి రాజు మంతెన కన్నుమూశారు. స్టార్ హీరో అల్లు అర్జున్ ఆయన భౌతిక కాయం సందర్శించి నివాళులు అర్పించారు. 

స్టార్ ప్రొడ్యూసర్ మధు మంతెన తండ్రిగారైన మురళి రాజు నేడు కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు సమాచారం. మార్చి 7 అనగా మంగళవారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. మురళీ రాజు మృతిని కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

మురళి రాజు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు స్వయానా మేనమామ. ఆయన కుమారుడు మధు మంతెన సొంత బ్యానర్ లో వర్మ రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, రాన్ వంటి చిత్రాలు తెరకెక్కించారు. మధు మంతెన హిందీలో ఎక్కువగా సినిమాలు తీశారు. హిందీ గజిని, క్వీన్, సూపర్ 30తో పాటు అనేక సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. మధు మంతెన తెలుగు, హిందీ,తమిళ భాషల్లో కలిపి 34 పైగా సినిమాలను నిర్మించారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ఇక నిర్మాత మధుతో హీరో అల్లు అర్జున్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ మధురా నగర్ లోని మురళి రాజు నివాసానికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని భీమవరంకి చెందిన మురళి రాజు గతంలో సినీ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే పలు వ్యాపారాలలో రాణించారు.టాలీవుడ్ చిత్ర ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ముంబై నుండి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. గత ఆరు నెలలుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.