నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ డాక్యుమెంట్లతోనే కోర్టులో తన సినిమా రిలీజ్ కాకుండా చేశారని వర్మ ఆరోపించారు.
తన సంతకాన్ని ఫోర్జరీ (forgery signature) చేశారంటూ హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్‌లో (panjagutta police station) ఫిర్యాదు చేశారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ram gopal varma). నట్టి క్రాంతి (natti kranthi) , నట్టి కరుణలపై (natti karuna) చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఇష్టం సినిమాకు సంబంధించి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు ఆర్జీవీ. నవంబర్ 30 2020న తాను డబ్బులు ఇవ్వాలంటూ నట్టి క్రాంతి, నట్టి కరుణలు నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపించారు.
ఆ నకిలీ డాక్యుమెంట్లతోనే కోర్టులో తన సినిమా రిలీజ్ కాకుండా చేశారని అన్నారు వర్మ. కోర్టు స్టేతో ఏప్రిల్ 8న రిలీజ్ కావాల్సిన నా ఇష్టం సినిమా ఆగిపోయిందని అన్నారు. అయితే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత అవి ఫేక్‌గా గుర్తించి.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వర్మ తెలిపారు. పంజాగుట్ట అడ్రస్‌తో తమ ఆఫీసులో ఎలాంటి పత్రాలు లేవని ఫోర్జరీ సంతకాలను ఫోరెన్సిక్‌కు పంపి నిజానిజాలు తేల్చాలని కోరారు రామ్‌గోపాల్ వర్మ.
