రామ్ గోపాల్ వర్మలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వయసు పెరగడం వల్లనేమో కానీ ఆయన మాట తీరులో చేష్టల్లో ఛేంజ్ స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ, దర్శకుడు రాజమౌళిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

దర్శకుడు వర్మ (Ram Gopal Varma)రాజమౌళి తీసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి ఆరు నిమిషాల ఆడియో ఫైల్ విడుదల చేశారు. వర్మ ఈ ఆడియోలో ఆద్యంతం రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రపంచంలో ఏ విషయం గురించైనా మాట్లాడే నాలెడ్జ్ నాకుంది. కానీ ఆర్ ఆర్ ఆర్ గురించి ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. ఆర్ ఆర్ ఆర్ ని వర్ణించడానికి మాటలు దొరకడం లేదన్నాడు. గత ముప్పై నలభై ఏళ్లలో ఏ సినిమాను నేను ఎంజాయ్ చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ మూవీని ఒక చిన్నపిల్లాడిలా ఆస్వాదించాను. అంటే దానర్ధం ఆర్ ఆర్ ఆర్ చిన్న పిల్లల మూవీ అని కాదు. 

Scroll to load tweet…

ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie)లో ప్రతి సన్నివేశం, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతం. అలాగే ఎమోషన్స్ తో కలిపి సినిమాను నడిపించిన తీరు అమోఘం. ఇద్దరు సూపర్ హీరోలు కొట్టుకోవడం వేరు. కానీ ఇద్దరు సామాన్యులైన హీరోలు ఒకరినొకరు తలపడడం, వాళ్ళ కళ్ళలో కనిపించే ఎమోషన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ పాత్ర ఎన్టీఆర్ పాత్ర కంటే బాగుంది అని కొందరు అంటున్నారు. అదంతా నాన్ సెన్స్. మూవీ కథ, కాంటెస్ట్ ప్రకారం పాత్రలు, వాటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. 

మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ ఒక విజువల్ వండర్. రాజమౌళి (Rajamouli)తెలుగు సినిమాకో, ఇండియన్ సినిమాకో అసెట్ కాదు. ఆయన ప్రేక్షకుల అసెట్. ఎంటర్టైన్ చేయడానికి ఈ భూమిపైకి వచ్చిన అరుదైన మనిషి. మళ్ళీ చెబుతున్నాను, ఆర్ ఆర్ ఆర్ గురించి చెప్పడానికి నాకు పదాలు దొరకడం లేదు.. అంటూ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్ ఆర్ ఆర్ మూవీపై ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయిలో రాజమౌళిని పొగిడినవారు లేరు. మంచిని మంచిగా చెడును చెడుగా చూస్తున్న వర్మలో ఈ మార్పుకు కారణం ఏమిటో అర్థం కావడం లేదు. హిందీ చిత్రం కాశ్మీర్ ఫైల్స్ టాక్ ఆఫ్ ది నేషన్ కాగా.. ఆ మూవీ గురించి వర్మ వరుస ట్వీట్స్ వేశారు. 

మరోవైపు ఆర్ ఆర్ ఆర్ పలు రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసింది. ఇక వీకెండ్ ముగిసే నాటికి ఏపీ/తెలంగాణలో ఆర్ ఆర్ ఆర్ మూవీ రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. హిందీలో ఆర్ ఆర్ ఆర్ వసూళ్లు ఆశాజనకంగా లేకున్నప్పటికీ సౌత్ లో దుమ్మురేపుతోంది.