ఎప్పుడూ ప్రశాంతంగా.. శాంతంగా ఉండే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కు కోపం వచ్చింది. మామూలుగా కాదు. ఒక్కొక్కరిని తరిమి కొట్టేంత  కోపం వచ్చింది. ఇంతకీ దర్శకేంద్రుడి కోపానికి కారణం ఏంటీ..?  


సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రల్లో నటించి.. శ్రీధర్‌ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాంటెడ్‌ పండుగాడ్‌. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్ కు రెడీ అవుతోంది. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాదో లో నిర్వహించారు. 

ఈ సందర్భంగా దర్శకులు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. మా వాంటెడ్‌ పండుగాడ్‌ ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగే సినిమా అన్నారు. ఈ నెలలో వచ్చిన బింబిసార, సీతారామం సినిమాల మాధిరిగానే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుంది అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ప్రీ రిలీజ్‌ వేడుక ను ఘనంగా నిర్వహించారు. అయితే ఆ సమయంలో అనసూయ మాట్లాడుతుండగా సుడిగాలి సుధీర్‌ స్టేజ్‌పైకి వచ్చాడు. అతన్ని చూడగానే ఫ్యాన్స్‌ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. 

ఈ గోలను చూసిన దర్శకేంద్రుడు స్వయంగా మైక్‌ తీసుకొని వారిని వారించే ప్రయత్నం చేశారు. అందరు నిశ్శబ్ధంగా ఉండాలి అని కోరారు.. అయితే ఆయన సైలెంట్‌గా ఉండాలని ఎంత కోరినా సుధీర్‌ ఫ్యాన్స్‌ వినిపించుకోలేదు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. అప్పటికీ ఓపికపట్టిన రాఘవేంద్ర రావు.. సుధీర్‌ సహా అందరూ మాట్లాడుతారని, కాస్త ఓపిగ్గా ఉండాలని కోరారు. అయినా సరే వినిపించుకోకుండా సుధీర్ ప్యాన్స్ అరుపులు కేకలతో రెచ్చిపోయారు. 

దాంతో ఇక ఒపిక నశించిన దర్శకేంద్రుడు సుధీర్ ఫాన్స్ పై ఫైర్ అయ్యారు... ఏం పిచ్చిపిచ్చిగా ఉందా? ఎవరు పిలిచారు వాళ్లని? పెద్దా చిన్నా తేడా లేదా? ఇలాగే ప్రవర్తిస్తే బయటకు పంపించేస్తా అంటూ సీరియస్‌ అయ్యారు. ఆయనలో ఎప్పుడే లేనంత ఆగ్రహం కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధిం‍చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.