ప్రస్తుతం సోషల్ మీడియా హవా ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి జమానాలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారేం చేసినా అది వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఏదైనా చిన్న లూప్ హోల్ కనిపిస్తే ఇక ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తారో తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాథ్ అలానే దొరికిపోయాడు. 

ప్రస్తుతం ఆయన రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా సినిమా గోవా షెడ్యూల్ పూర్తి అయిన సందర్భంగా చిత్రబృందం పార్టీ చేసుకొని ఓ ఫోటో దిగింది. అది సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయింది.

దానికి కారణం దర్శకుడు పూరి.. హీరోయిన్ నిధి అగర్వాల్ నడుముపై చెయ్యి వేయడమే అని చెప్పాలి. ఈ ఫోటోలో పూరికి ఒకవైపు ఛార్మి ఉండగా, మరోవైపు నిధి ఉంది. పూరి కుడి చేతిని ఛార్మి పట్టుకోగా.. అతడి ఎడమ చేయి నిధి నడుముపై వేశాడు. 

పైగా పూరి ఆమె నడుముని గట్టిగా పట్టుకున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. ఇది గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో పూరిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఎన్ని ఫ్లాపుల్లో ఉన్నా.. పూరి ఆటిట్యూడ్ లో మాత్రం మారదంటూ విమర్శిస్తున్నారు.