Asianet News TeluguAsianet News Telugu

గెటప్ మార్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఇలా అయ్యాడేంటి..?

ఈమధ్య మన సినిమా తారలు ఎవరు ఎలా ఉంటారు.. ఎప్పుడు ఎలాంటి గెటప్ లలో కనిపిస్తారో తెలుసుకోవడం కష్టంగామారింది. ఇదివరకు హీరోలు ఇలా షాక్ ఇచ్చేవారు.. కాని ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఇలానే మారిపోయి షాకుల మీద షాకులిస్తున్నారు. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఇలానే షాక్ ఇచ్చారు. 

Director Puri Jagannath New Look Viral In Social Media  JMS
Author
First Published Nov 5, 2023, 11:12 AM IST


పూరీ జగన్నాథ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్ హీరోలకంటే ఎక్కువగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన అంటేపడి చచ్చిపోతుంటార. ఎందుకుంటే పూరీ సినిమాలు జనాలకు అంత కిక్కినిస్తుంటాయి. ఉత్తేజాన్ని ఇస్తాయి. కుర్రాళ్లను ఉరకలు పెట్టిస్తుంటాయి. దాంతో పూరీ సినిమాలకు ఎంతో మంది ఫిదా అవుతుంటారు. ప్లప్ సినిమా అయినా సరే.. పూరీ డైలాగ్స్ కోసంవెళ్ళేవారు చాలా మంది ఉనారు. ఈమధ్య ఎక్కువగా ప్లాప్ సినిమాలు చేస్తూ వచ్చిన పూరీ.. ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఫామ్ లోకి వచ్చాడు. సరే ఫామ్ లోకి వచ్చాడు కదా అని అనుకుంటే.. మళ్ళీ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను ఫేస్ చేశాడు స్టార్ సీనియర్ దర్శకుడు. 

ఇక ఈక్రమంలో ప్రస్తుతం పూరీ జన్నాథ్.. తనకు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ తో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈసినిమాతో పెద్ద ప్లాన్ వేశాడు పూరి. ఈసారి ఎలాగైన్ మంచి సినిమాతో మరోసారిరీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈక్రమంలో పూరీ సినిమా గురించి ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు జనాలు. అయితే తాజాగా పూరీకి సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూరీ ఫోటోను పోస్ట్ చేస్తూ తాజాగా ఛార్మీ ఓ పోస్ట్ ను శేర్ చేశారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Charmmekaur (@charmmekaur)

అయితే ఛార్మీ శేర్ చేసిన ఫోటోలో పూరీ జగన్నాథ్ చాలా డిఫరెంట్ గా కనిపించారు. పూరీ జగన్నాథ్ ఫోటోను షేర్ చేస్తూ.. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది ఛార్మి. ఇక ఈఫోటోలు పూరి షార్ట్ హెయిర్ తో కనిపించాడు. గుండు చేసుకుని ఉన్నట్టు కనిపించాడు పూరి. దాంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పూరీ ఎంటీ ఇలా అయిపోయాడు ఏమైంది ఆయనకు అని ప్రశ్నిస్తున్నారు.  ఎందుకో అతని మోహంలో చాలా తేడా వచ్చింది. అనారోగ్యం పాలైతే మోహంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అలా ఉంది పూరీ లుక్. 

దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే పూరీ టీంని అడిగితే.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.. ప్రస్తుతం వెకేషన్లో ఉన్నారు అంటూ చెబుతున్నారు.పూరి జగన్నాథ్ లైగర్ ప్లాప్ తరువాత బయట కనిపించలేదు. ఛార్మీతో పాటు.. పూరి కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. కాని డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కాస్త అప్పడప్పుడు కనిపిస్తున్నారు. తాజగా మరోసారి లాంగ్ డేస్ గ్యాప్ ఇచ్చిన దర్శకుడు.. రీసెంట్ గా ఇలా కనిపించి షాక్ఇచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios