దర్శకుడు పూరి జగన్నాథ్ కి పెంపుడు కుక్కలంటే ఎంతో ఇష్టం. వాటిని ఇంట్లో మనిషిగా చూసుకునే పూరి చాలా సార్లు తన డాగ్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యేవారు. ఇక ఇప్పుడు ఎంతో ఇష్టంగా పెంచుకున్న జాక్స్ మరణించినట్లు పూరి బాధతో వివరణ ఇచ్చాడు. 

వీడి పేరు జాక్స్. ఎప్పుడు నాతోనే ఉండేది. ఒకానొక సమయంలో వీడిని పెంచే పరిస్థితి లేక నా స్నేహితుడికి ఇచ్చేశాను. 5 ఏళ్ల తరువాత మళ్ళీ తీసుకొచ్చేసాను. కానీ వాడు హార్ట్ అయ్యి అప్పటినుంచి నాతో మాట్లాడటం మానేశాడు. దగ్గరకు రాడు. నా వైపు చూడడు. తోక కూడా ఊపి ఇప్పటికి 8 ఏళ్లవుతోంది. 

నేను లైఫ్ లో ఎంత మందిని బాధ పెట్టానో నాకు తెలియదు కానీ వీడిని మాత్రం చాలా బాధపెట్టాను. వాడు ఇక లేడు అని ఆ రోజే అతనికి చివరి రోజంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.