దర్శకుడు పూరి జగన్నాధ్ మ్యూసింగ్స్ బాగా పాప్యులర్ అయ్యాయి. ఆయన మోడరన్ ఫిలాసఫీ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది. లేటెస్ట్ అండ్ టెంపరరీ టాపిక్స్ పై ఆయన చేస్తున్న విశ్లేషణ, నిజజీవితాలకు దగ్గరగా, నిజమే కదా అనిపించేలా ఉంటుంది. అందుకే పూరి మ్యూసింగ్స్ గ్రేట్ అంటూ అందరూ కితాబు ఇస్తున్నారు. తాజాగా పూరి జగన్నాధ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనే టాపిక్ పై మాట్లాడారు. 

ఒక విషయం నుండి ఫన్ రాబట్టగల కెపాసిటీనే సెన్స్ ఆఫ్ హ్యూమర్. మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలంటే మీరు ఇగోయిస్టు అయి ఉండకూడదు. మీపై మీరు జోక్స్ వేసుకొనే కెపాసిటీ ఉండాలి అన్నారు. సర్దార్జీలపై అందరూ జోక్స్ వేస్తారు...వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళుగా అంచనా వేస్తారు, నిజానికి వాళ్ళు మనకంటే రెండు రెట్లు జీనియస్ లు. మనల్ని నవ్వించడానికి వాళ్ళు వాళ్ళని అలా ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఎదుటవాళ్ళను నవ్వించడం అనేది లీడర్షిప్ క్వాలిటీ, అన్నారు. 

మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే అందరికీ నచ్చుతారని, మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారని చెప్పారు. కోప్పడే బాసుని నవ్వుతూ పలకరిస్తే కొన్నాళ్ళకు నువ్వు అతని ఫేవరేట్ ఎంప్లాయ్ అవుతావు.  నీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు నిన్ను లైక్ చేయాలంటే నిన్ను నువ్వు ఒక పూల్ గా ప్రొజెక్ట్ చేసుకో, అలా కాకుండా నేను అందరి కంటే జీనియస్ అంటే అందరికీ ఎక్కడో కాలుతుంది అని పూరి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.