లైగర్ మూవీ ఫలితం రాకుండానే దర్శకుడు పూరితో మరో చిత్రానికి విజయ్ దేవరకొండ కమిట్ అయ్యారు. విజయ్ కెరీర్ కీలక దశలో ఉండగా.. వరుసగా పూరితో చేస్తున్న చిత్రాలు విజయ్ భవిష్యత్ డిసైడ్ చేయనున్నాయి.

పేట్రియాటిక్ సబ్జెక్టు తో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేస్తున్న మూవీ JGM (జనగణమన). నిన్న అధికారిక ప్రకటన జరగడంతో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ప్రెస్ మీట్లో పాల్గొన్న చిత్ర యూనిట్ మూవీ డిటైల్స్ పంచుకున్నారు. కాగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ తో చేయాలనుకున్న పూరి జగన్నాధ్ కుదరకపోవడంతో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కమిట్ అయ్యాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 

జెజిఎమ్ దర్శకుడు పూరి జగన్నాధ్(Puri Jagannadh) డ్రీం ప్రాజెక్ట్. ఆయన స్టార్ డైరెక్టర్ గా ఫార్మ్ లో ఉన్నప్పుడే ఈ మూవీ ప్రకటన చేశారు. ఇక ఈ సబ్జెక్టుకి పవన్ కళ్యాణ్, లేదా మహేష్ బాబు సెట్ అవుతారనేది పూరి నమ్మకం. ముందుగా పూరి ఈ ఇద్దరిని కలవడం జరిగింది. 2018 తర్వాత పవన్ సినిమాలకు బ్రేక్ ప్రకటించారు. అదే సమయంలో మహేష్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వరుస ప్లాప్స్ తో పూరి ఫార్మ్ లో లేకపోవడం వలన ఈ సబ్జెక్టు కి స్టార్ హీరో దొరకలేదు. మహేష్ ఇష్టపడితే జెజిఎమ్ సెట్స్ పైకి వెళ్ళేది. ఈ ప్రాజెక్ట్ ని మహేష్ సున్నితంగా తిరస్కరించారు. 

నేను ప్లాప్స్ లో ఉన్నప్పుడు మహేష్ పట్టించుకోలేదని పూరి ఓపెన్ గానే అసహనం వెళ్లగక్కారు. నిజానికి వీరిద్దరిదీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. పోకిరి ఇండస్ట్రీ హిట్ కాగా, బిజినెస్ మేన్ సూపర్ హిట్ గా నిలిచింది. అయినప్పటికీ పూరితో జనగణమన చేయడానికి మహేష్ ఆసక్తి చూపలేదు. అంతా కోల్పోయి హిట్ పడితేనే లైఫ్ అన్న స్థితికి చేరుకున్న పూరీకి ఇస్మార్ట్ శంకర్ ఊపిరిపోసింది. నిర్మాతగా ఆయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టింది. 

ఆ సినిమా విజయం కారణంగానే విజయ్ దేవరకొండ ఆయనతో మూవీ చేయడానికి ముందుకు వచ్చారు. ఇక కరణ్ జోహార్ తోడు కావడంతో విజయ్ లైగర్ పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంది. ఒక్క హిట్ ఇస్తే వరుసగా ప్లాప్స్ ఇవ్వడం పూరికి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్. అలాంటిది లైగర్ (Ligar)ఫలితం రాకుండానే విజయ్ ఆయనతో మరో ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. సబ్జెక్టు పరంగా కూడా ఈ మూవీ కొంచెం రిస్క్ తో కూడుకున్నదే అని చెప్పాలి. లవర్ బాయ్ ఇమేజ్ కలిగిన విజయ్ దేవరకొండకు ఈ సీరియస్ పేట్రియాటిక్ సబ్జెక్టు ఎంత మేర సెట్ అవుతుందనే అనుమానాలున్నాయి. 

విజయ్ కెరీర్ చూసుకుంటే ఆయనకు విజయాలు అందించిన చిత్రాలన్నీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్. కొంచెం సామాజిక కోణం జోడించి చేసిన డియర్ కామ్రేడ్ ప్రతికూల ఫలితం అందుకుంది. అంత మాత్రాన విజయ్ దేవరకొండకు మాస్, యాక్షన్ జోనర్స్ సెట్ కావని చెప్పలేం. లైగర్ మూవీ విజయం సాధిస్తే విజయ్ ఇమేజ్ పెద్ద స్థాయికి చేరుతుంది. అలాగే ఆయనకు మాస్ ఇమేజ్ దక్కుతుంది. లైగర్ హిట్ కొడితే ఈ జేజిఎమ్ పై కూడా హైప్ ఏర్పడుతుంది. చూడాలి పూరి సారధ్యంలో విజయ్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో...