మహేష్ లాంటి స్టార్ హీరోతో ''నేను ఎంత ఎధవనో నాకే తెలియదు..'' అనే డైలాగ్ చెప్పించాలనే థాట్ రావడమే కష్టం, అలాంటిది ఆయన్ని ఒప్పించడం మరో సాహసం. దర్శకుడు పూరి జగన్నాధ్ పోకిరి మూవీలో ఆయనతో ఆ డైలాగ్ చెప్పింది ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. పాత్రకు తగ్గట్టుగా పూరి డైలాగ్స్ చాలా కరుకుగా ఉంటాయి. చెప్పేది ఏదైనా చెంపపై కొట్టి చెప్పినట్లు ఉంటుంది. హిట్స్, ఫ్లాప్స్ పక్కన పెడితే పూరి సినిమాలంటే అమితంగాఇష్టపడేవారు చాల మంది ఉన్నారు. సపరేట్ ఫ్యాన్ బేస్ కలిగిన అతికొద్ది మంది దర్శకుల్లో పూరి ఒకరు. ఆయన సినిమాలు చాల జెన్యూన్ గా ఉంటాయి. ఆయన మసిపూసి మారేడు కాయ చేసే రకం కాదు. 

టాలీవుడ్  స్టార్ హీరోలు వెనుకబడిన స్టార్ డమ్ నుండి, టు టైర్ హీరోలు కూడా ముఖం చాటేసిన డౌన్ ఫాల్ కి ఒక దశలో పూరి కెరీర్ చేరింది. ఎవరెస్టు సిట్యువేషన్ నుండి వరస్ట్ కండిషన్స్ పేస్ చేసిన పూరి అనేక జీవిత సత్యాలు తెలుసుకున్నారు. మోసం చేసిన మనుషులు, అవసరానికి వాడుకుని వదిలేసిన బంధాలు ఆయన పేస్ చేయడం జరిగింది. సంపాదించిన సర్వం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితిలో.. సినిమానే నమ్ముకున్న పూరి మరలా తిరిగి నిలబడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ విజయంతో పూరి తనలో క్రియేటివిటీ చావలేదని నిరూపించాడు. దుర్భర పరిస్థితుల నుండి కరణ్ జోహార్ తో కలిసి పాన్ ఇండియా మూవీ చేసే స్థాయికి చేరాడు. 

కాగా పూరి తన జీవితానుభవాలను అన్నింటినీ చర్చిస్తూ మ్యూసింగ్స్ పేరుతో కొన్ని ఆడియో ఫైల్స్ సిద్ధం చేశారు. పూరి చెప్పిన ఆ గొప్ప వ్యాఖ్యలు స్పాటిఫై మరియు ఆపిల్ పాడ్ కాస్ట్స్ లో అందుబాటులో ఉన్నాయి. పూరి చెప్పిన, చర్చించిన అనేక విషయాలు సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు ఊపేస్తున్నాయి. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వర్మ లాంటి వారు పూరి ఆడియోలో ఉన్న విషయాల గురించి గొప్పగా మాట్లాడారు. ఏమైనా ఈ మూసింగ్స్ తో పూరి నయా ట్రెండ్ మొదలుపెట్టారు.