జర్నలిస్ట్ తో దర్శకుడి నిశ్చితార్థం.. విషెస్ తెలిపిన స్టార్ హీరో

త్వరలో ఓ క్రేజీ దర్శకుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఆయన మరెవరో కాదు.. పీఎస్ మిత్రన్. దర్శకుడు పీఎస్ మిత్రన్ తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

Director PS Mithran got engaged with ashameera

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు సహజమే. త్వరలో ఓ క్రేజీ దర్శకుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఆయన మరెవరో కాదు.. పీఎస్ మిత్రన్. దర్శకుడు పీఎస్ మిత్రన్ తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. హీరో విశాల్ తో తెరకెక్కించిన అభిమన్యుడు చిత్రంతో మిత్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. 

థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన అభిమన్యుడు మంచి విజయం సాధించింది. ఆ తర్వాత క్రేజీ హీరో శివకార్తికేయన్ తో హీరో అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. దీనితో మిత్రన్ తమిళంలో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. 

ఇదిలా ఉండగా మిత్రన్ కొంతకాలంగా ఫిలిం జర్నలిస్ట్ ఆషామీరా అయ్యప్పన్ అనే ఫిలిం జర్నలిస్ట్ తో ప్రేమలో ఉన్నారు. ఎట్టకేలకు ఈ జంట వివాహం చేసుకోబోతోంది. తాజాగా వీరి నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది.   

వీరి నిశ్చితార్థానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో ఫ్యాన్స్, స్నేహితుల నుంచి వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే వీరి వివాహం ఉండబోతోంది. 

పీఎస్ మిత్రన్, ఆషామీరా నిశ్చితార్థం సందర్భంగా క్రేజీ హీరో కార్తీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. పీఎస్ మిత్రన్ ప్రస్తుతం కార్తీతో 'సర్దార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios