మలయాళీ భామ ప్రియా ప్రకాష్ కి అసలు నటనే రాదని.. హీరోయిన్ గా ఆమె సరైన హావభావాలు కూడా పలికించలేదని 'లవర్స్ డే' చిత్ర దర్శకుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మలయాళంలో దర్శకుడు ఒమర్ లులు 'ఒరు అడార్ లవ్'(తెలుగులో 'లవర్స్ డే') అనే సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమాలో 'మాణిక్య మలరయ' అనే పాట విడుదలైన తరువాత అందులో కన్నుగీటిన బ్యూటీ ప్రియా ప్రకాష్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అప్పటివరకు ప్రియా ప్రకాష్ ది సైడ్ క్యారెక్టర్.

కానీ నిర్మాతలు ఆమెనే హీరోయిన్ గా పెట్టాలని పట్టుబట్టడంతో తనకు మరో ఆప్షన్ లేక ఒప్పుకోవాల్సి వచ్చిందని దర్శకుడు ఒమర్ లులు వెల్లడించారు. అసలు హీరోయిన్ నూరిన్ ని పక్కన పెట్టి ప్రియా చుట్టూ కథ తిరిగేలా మార్చడంతో సినిమాకి సరైన రిజల్ట్ రాలేదని వాపోయారు. 

ప్రియా ప్రకాష్ కోసం తాను చాలా త్యాగాలు చేసానని కానీ ఆమె మాత్రం సినిమా విడుదలైన తరువాత ప్రమోషన్స్ కి రాలేదని.. ఆమె ప్రచారం చేసి ఉంటే వసూళ్లు పెరిగి ఉండేవని అభిప్రాయపడ్డాడు. 

ప్రియాప్రకాష్ కి నటన రాదనిమ ఆమెతో హావభావాలు పలికించలేకపోయానని, కాసేపు కనబడే పాత్ర కాబట్టి తీసుకున్నానే కానీ హీరోయిన్ వేషమైతే ఇచ్చేవాడినే కాదని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.