ఓంకారన్నయ్య మళ్లీ తమ్ముడు కోసం రిస్క్?

తమిళ కొరియోగ్రాఫర్, హీరో కమ్ డైరక్టర్ లారెన్స్ లాగ హారర్ కామెడీ సీక్వెల్స్ చేద్దామనుకున్నా కలిసి రావటం లలేదు. దానికి తోడు తన తమ్ముడిని హీరోగా నిలబెట్టడం తన బాధ్యత అన్న ఓంకార్‌ అందుకోసమే ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాడు.  

Director  Ohmkar wants to star Raajugari Gadhi jsp

 రాజుగారి గది, రాజుగారి గది 2 ,రాజుగారి గది 3 సినిమాలతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓంకార్ డైరెక్షన్‌లో.. వచ్చిన ఈ మొదటి రెండు సినిమాలు అభిమానులను బాగానే ఎంటర్‌టైన్ చేశాయి. తన తమ్ముడు ‘అశ్విన్ బాబు’ను హీరోగా పరిచయం చేస్తూ.. తీసిన ‘రాజుగారి గది’ మంచి హిట్ అయ్యింది. దీంతో.. రాజుగారి గది-2లో స్టార్ హీరోయిన్ సమంత, మామ కింగ్ నాగ్ సందడి చేశారు. ఇది కూడా మంచి కలెక్షన్లు సాధించింది. కాగా..   ‘రాజుగారి గది-3’ మాత్రం వర్కవుట్ కాలేదు.  ఇందులో.. స్టార్ హీరోయిన్ తమన్నా, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్.. అవికా గోర్, అశ్విన్, ఆలీ, ధన్‌రాజ్ పలువురు నటించిననా కలిసి రాలేదు.  అయితే ఓంకార్  మాత్రం నిరాశపడదలుచుకోలేదు. రాజుగారి గది 4 కి రంగం సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.

టైటిల్ తప్ప ఈ  ప్రాజెక్టుకు చెప్పుకోదగ్గ  ఎలిమెంట్స్ అయితే  ప్రస్తుతానికి ఏమీ లేవు. ఓంకార్‌ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన రాజుగాది గది 3 సినిమా వర్కవుట్ అయ్యి ఉంటే  కథ వేరుగా  ఉండేది. నాగార్జున హీరోగా తెరకెక్కిన రాజుగారి గది 2కు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో తమిళ కొరియోగ్రాఫర్, హీరో కమ్ డైరక్టర్ లారెన్స్ లాగ హారర్ కామెడీ సీక్వెల్స్ చేద్దామనుకున్నా కలిసి రావటం లలేదు. దానికి తోడు తన తమ్ముడిని హీరోగా నిలబెట్టడం తన బాధ్యత అన్న ఓంకార్‌ అందుకోసమే ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు నాలుగో పార్ట్ లోనూ తన తమ్ముడునే హీరోగా అనుకుంటున్నాడట.

ఇక బుల్లితెరపై ఓంకార్ హోస్ట్ చేసే, నిర్మించే షోలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఇస్మార్ట్ జోడి, డ్యాన్స్ ప్లస్, సిక్స్త్ సెన్స్ వంటి షోలతో ఓంకార్ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు. అలాంటి ఓంకార్ ఈ మధ్యే డ్యాన్స్ ప్లస్ షోను విజయవంతంగా పూర్తి చేసేశారు. ఇక ఇప్పుడు సిక్స్త్ సెన్స్ అంటూ రాబోతోన్నారు. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా నడిపించిన ఓంకార్ ఇక నాల్గో సీజన్‌తో అదరకొట్టేందుకు రెడీ అయ్యారు.

 బంచులకొద్దీ పంచులు వేసే ఆది, గ్లామరస్ స్టార్ యాంకర్ అనసూయ.. ఇంకా బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సిక్స్త్ సెన్స్ సీజన్ 4 కి వచ్చిన ఆ నలుగురు కంటెస్టెంట్స్ సోహెల్, మహబూబ్, అరియనా, హారిక.. మొదటి వారం చేసిన సందడి; స్టార్ ప్రెజెంటర్ ఓంకార్ కొత్త స్టైల్ – వినోదాన్ని కొత్తగా నిర్వచించబోతోంది. రానున్న ఎపిసోడ్స్ లో ఊహించని కంటెస్టెంట్స్ ఎందరో ఈ వేదిక పైన హంగామా చేయబోతున్నారు.సిక్స్త్ సెన్స్ ని మూడు సీజన్లను విజయవంతంగా ఇంటరెస్టింగ్ గా తనదైన శైలిలో నిర్వహిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఓంకార్ ఈ నాలుగో సీజన్లో ఓ కొత్త పంధాలో షోని ఓ కంప్లీట్ ప్యాకేజిలా అందిస్తున్నారు. ఇంతకు ముందు సీజన్స్ లో వున్న ఫార్ములాని కొనసాగిస్తూనే కొత్త రౌండ్స్ ని కూడా పరిచయం చేయబోతున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios