పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఆయన రాబోయే చిత్రాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో కాస్తా చిర్రెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ‘ప్రాజెక్ట్ కే’ దర్శకుడు నాగ్ అశ్విన్ అప్డేట్స్ పై స్పందించారు.
ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్స్ పై అప్డేట్స్ పై అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. చివరిగా భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘రాధే శ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ (Prabhas).. తన అభిమానులను కాస్తా అప్సెట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ప్రస్తుతం అప్ కమింగ్ ఫిల్మ్స్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ అప్డేట్స్ గురించి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ సినిమాల అప్డేట్స్ విషయంలో మేకర్స్ చాలా ఆలస్యం చేస్తున్నారని చిర్రెత్తిపోతున్నారు. ఇంత ఆలస్యం ఎందుకంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా స్పందించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రాల ఫలితాల విషయంలో అభిమానులు చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన ‘రాధే శ్యామ్’ చిత్రం నెగెటివ్ టాక్ రావడంతో ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని తిలక్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల ప్రభాస్ అభిమాని రవితేజ ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్నటి మొన్న మరో అభిమాని ‘సలార్’ అప్డేట్స్ రావట్లేదని అప్సెట్ అయ్యాడు. దీంతో సూసైడ్ లెటర్ రాస్తూ మేకర్స్ ను హెచ్చరించాడు. ‘ఈ నెలలోగా సలార్ నుంచి అప్డేట్స్ రాకపోతే ప్రాణం తీసుకుంటాను’ అంటూ సూసైడ్ లెటర్ రాయడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ సందర్భంగా ప్రభాస్ మరో అభిమాని ‘ప్రాజెక్ట్ కే’పై అప్డేట్ కోరుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ కు ట్వీట్ చేశారు. ‘హాయ్ నాగ్ అశ్విన్ అన్న.. గుర్తున్నామా?’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఆ ట్వీట్ కు వెంటనే నాగ్ అశ్విన్ స్పందించాడు. రిప్లై ఇస్తూ.. ‘గుర్తున్నారు.. ఇప్పుడే ఒక షెడ్యూల్ పూర్తైంది. ప్రభాస్ గారి ఇంట్రో బిట్ కూడా కంప్లీట్ అయ్యింది. మీ అభిమాన హీరో చాలా కూల్ గా కనిపిస్తున్నారు. జూన్ చివరి నుంచి తదుపరి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. రిలీజ్ ఆర్డర్ లో మనం లాస్ట్ కదా.. తరుచూ అప్డేట్స్ ఇవ్వడానికి సమయం ఉంది. కానీ Project K కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం’ అని బదులిచ్చాడు.
ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న Salaar చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలో ప్రాజెక్ట్ కే షెడ్యూల్ లో జాయిన్ కానున్నారు. రూ.500 కోట్లతో పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ గా దీపికా పదుకునే (Deepika Padukone) నటిస్తోంది. మరో కీలక పాత్రను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పోషిస్తున్నారు.
