Asianet News TeluguAsianet News Telugu

Gaami : మహాశివరాత్రికి విశ్వక్ సేన్ కొత్త సినిమా... స్పందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.!

విశ్వక్ సేన్ (Vishwak Sen) కొత్త సినిమా పోస్టర్ భయంకరంగా ఉంది. మాస్ కా దాస్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ గా మారింది. 

Director Nag Ashwin Comments on Vishwak Sens Upcomig Movie Gaami NSK
Author
First Published Feb 11, 2024, 5:52 PM IST | Last Updated Feb 11, 2024, 5:53 PM IST

మాస్ కా దాస్ త్వరలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో అలరించబోతున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే మరో సినిమా ‘గామీ’ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ మొన్నటి సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన విశ్వక్ సేన్ Gangs of Godavari చిత్రం వాయిదా పడింది. తొలుత ఈ చిత్రమే వస్తుందనుకుంటే... దీని కంటే ముందు మరో చిత్రాన్ని రంగంలోకి దించాడు విశ్వక్ సేన్... ఇప్పుడా సినిమా ప్రమోషన్స్ లోనే ఉన్నారు. 

ఎప్పుడో ప్రారంభమైన ‘గామీ’ Gaami అనే చిత్రం నుంచి విశ్వక్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో చివరిగా ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. ఇక నెక్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ తో కూడిన ఈ సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. మార్చి 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

ఇక విశ్వక్ సేన్ నుంచి నెక్ట్స్ ఈ చిత్రమే ప్రేక్షకుల ముందుకు రానుందని తేలిపోయింది. మహాశివరాత్రి కానుకగా విడుదలవుతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ ను ఇప్పటి నుంచే షురూ చేశాడు యంగ్ హీరో విశ్వక్. ఇదిలా ఉంటే ఈ సినిమాపై క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు... ‘ఈ యువకులు ఏం చేశారని చూసేందుకు వేచి ఉన్నాను.. వీళ్లంతా ఎంతో ప్రేమతో, ఇష్టంతో చేసిన సినిమా గామీ కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ స్పందించారు. 

ప్రభాస్ తో ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్ ఫోకస్ ఈ చిత్రంపై పడటం ఆసక్తికరంగా మారింది. ఇక మున్ముందు ‘గామీ’ నుంచి ఎలాంటి అప్డేట్స్ రానున్నాయనేది వేచి చూడాలి. ఈ చిత్రం అడ్వెంచర్, థ్రిల్లర్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. యూవీ క్రియేషన్స్, కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కార్తీక్ శబరీశ్ నిర్మించారు. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కలర్ ఫొటో’ హీరోయిన్ చాందిని చౌదరి Chandini Chowdary హీరోయిన్ గా నటిస్తోంది.

Director Nag Ashwin Comments on Vishwak Sens Upcomig Movie Gaami NSK

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios