మరో వారం రోజుల్లో నాని వి చిత్రం ద్వారా ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వి అమెజాన్  ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. నెలలుగా  విడుదల కోసం ఎదురుచూస్తున్న చిత్ర యూనిట్ థియేటర్స్ బంధ్ కారణంగా ఓ టి టి విడుదలకు మొగ్గు చూపారు. సెప్టెంబర్ 5నుండి వి చిత్రం ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. 

చిత్ర విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో హీరో నానితో పాటు సుధీర్, దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో మోహన కృష్ణ వి చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాగా వి మూవీలో ఇద్దరు హీరోలు ఉండగా ఎవరికి ప్రాధాన్యం ఉంటుంది అనగా, ఈ కథలో ఇద్దరు హీరోలు నాని, సుధీర్ పాత్రలకు సమాన ప్రాధ్యానత ఉంటుంది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, సైకో పాత్ సీరియల్ కిల్లర్  జరిగే ఆధిపత్యపోరు ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు. 

రెగ్యులర్ సినిమాలలో వలె ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి, వారి మధ్య భీకరమైన ఫైట్స్, కొన్ని సాంగ్స్ అన్నట్లుగా ఉండదు. స్టోరీ డ్రివెన్ మూవీలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది అన్నారు. నాని 25వ చిత్రంలో మరో హీరోకి ప్రాధాన్యం ఉండడాన్ని నాని ఎలా ఒప్పుకున్నారన్న ప్రశ్నకు ఆయన నాని అలా ఆలోచించడు.ఆయన కథను నమ్ముతారు. అందుకే తన ల్యాండ్ మార్క్ మూవీ మల్టీస్టారర్ అయినా ఒప్పుకున్నారు అన్నారు.