మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. నేడు ఆదివారం రోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ వేడుకలో భోళా శంకర్ చిత్ర డైరెక్టర్ మెహర్ రమేష్ ఎమోషనల్ గా మాట్లాడారు. షాడోలో ఉన్న నాపై చిరంజీవి వెలుగు పడింది అంటూ తన గత పరాజయాల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. భోళా శంకర్ చిత్రం తనకు ఒక పునర్జన్మ అని మెహర్ రమేష్ అన్నారు.
నిర్మాత అనిల్ సుంకర గారి ద్వారా నా కల నెరవేరింది. ఒకప్పుడు మెగా అభిమాని అంటేనే ఒక గుర్తింపు ఉండేది అప్పటి నుంచే నేను చిరంజీవి గారి అభిమానిని. చిరంజీవి గారి చుట్టం కాబట్టి ఆ గుర్తింపు ఇంకా పెరిగింది. మా కుటుంబ సభ్యులందరికి చిరంజీవి అంటే ప్రాణం. ఈ చిత్ర యూనిట్ అంతా చిరంజీవి గారి లవర్స్ అని మెహర్ రమేష్ అన్నారు.
అన్నయ్య నిండైన ప్రేమ మూర్తి. ఎవరిపైన అయినా కోపం వస్తే సహనంతో ఉండాలి రా అంటూ మందలిస్తారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. చిరంజీవి అంటే ఎటెర్టైన్మెంట్ కి ఎంపరర్. ఈ చిత్రంలో కూడా అదే చూస్తారు అని మెహర్ రమేష్ తెలిపారు. చిరంజీవి పక్కన చెల్లిగా నటించాలి అంటే ఆమె కూడా మెగా నటే అయి ఉండాలి. చివరకు మహానటి దొరికింది అని కీర్తి సురేష్ పై మెహర్ రమేష్ ప్రశంసలు కురిపించారు.
