మారుతి సినిమా గురించే కంగారు అంతా.. ఈనేపధ్యంలో ఈ చిత్రం గురించి రకరకాల విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిపురుష్’రిలీజైంది. ఆ సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్’ చిత్రాలతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎలాగో ప్రశాంత్ నీల్ సినిమా పెద్ద హిట్ అవుతుందని అందరూ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. మారుతి సినిమా గురించే కంగారు అంతా.. ఈనేపధ్యంలో ఈ చిత్రం గురించి రకరకాల విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం టైటిల్ మారిందని వార్తలు మీడియాలో వార్తలు గుప్పుమన్నారు. 

అసలు ఇప్పటిదాకా ఏ టైటిల్ అఫీషియల్ గా ప్రకటించలేదనే లేదు. అయితే ‘రాజా డీలక్స్‌’ అని ఫిక్స్‌ చేశారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ‘వింటేజ్‌ కింగ్‌’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. అందులో నిజమేంటనేది అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు సదరు చిత్ర యూనిట్ కూడా రెడీ అయ్యిందట. ఇక ఈ సినిమా ఔట్‌పుట్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. తాజాగా ఓ అభిమానికి ఈ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరో ప్రక్క ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సలార్‌’ సినిమాలోని తొలి భాగం ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ సెప్టెంబరు 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. విజయ్‌ కిరగందూర్‌ ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ వర్క్‌ను ఆరంభించారు. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.