శ్రేయాస్ మీడియా బేనర్ పై తెరకెక్కిన వెంకటాపురం వెంకటాపురం కథను అద్భుతంగా తెరకెక్కించారన్న మారుతి ఇద్దరి జీవితాల్లో జరిగిన మలుపు, పరిణామాలు కథగా తెరకెక్కిన వెంకటాపురం
హ్యాపీ డేస్' ఫేమ్ రాహుల్ .. మహిమ మక్వాన జంటగా 'వెంకటాపురం' సినిమా తెరకెక్కింది. వేణు మడికంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీమ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ, ఈ సినిమా అవుట్ పుట్ చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు. రీ రికార్డింగ్ పూర్తి కాకుండానే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ తనని కట్టిపడేసిందని అన్నాడు. ఇక రీ రికార్డింగ్ పూర్తయితే ఒక రేంజ్ లో వుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కెమెరా పనితనం .. సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పాడు. దాదాపు 250 థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కానుంది.
