మొన్న వరలక్ష్మీ శరత్ కుమార్,, నేడు మణిరత్నం.. ఇలా వరుసగా కోలీవుడ్ లో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వరుసగా తమిళ స్టార్స్ కరోనా వలయంలోచిక్కుకుంటున్నారు.  

 దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్ళీ పడగవిప్పుతోంది. ముఖ్యంగా తమళనాట రాజకీయ,సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. కేసులు కూడా దేశవ్యాప్తంగా 20 వేలు దాటిపోయాయి. తమిళ నాట ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా కరోనా బారిని పడుతున్నారు. ఇక ఎప్పటి లాగానే సినిమా వాళ్ళను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు. రీసెంట్ గా హీరో శరత్ కుమార్ కూతురు స్టార్ యాక్ట్రస్ వరలక్ష్మీ శరత్ కుమార్ కరోనాబారిన పడ్డారు. ఇక రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ మణిరత్నం కోవిడ్ కు గురయ్యారు. 

కరోనా వాక్సిన్ లు వేసుకొని , పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మహమ్మారి మాత్రం వదలడం లేదు. తాజాగా సినీ లెజెండ్రీ డైరెక్ట‌ర్ మణిరత్నం కరోనా బారినపడ్డారు. ప్రస్తుతంమణిరత్నం కరోనా తో చెన్నై లోని అపోలో హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన భార్య, సీనియర్ నటి సుహాసిని మణిరత్నం ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 


మణి రత్నం ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో పొన్నియిన్ సెల్వన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. దాని కోసమే వరుసగా షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు స్టార్ డైరెక్టర్. లైకా ప్రొడ‌క్ష‌న్‌తో క‌లిసి ఆయ‌న మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాలో తొలి భాగం సెప్టెంబ‌ర్ 30న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతుంది. 

అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా మణిరత్నం కు కరోనా అని తెలిసి సెట్స్ లో కలకలం స్టార్ట్ అయ్యింది. ఈ మధ్యలో ఆయన ఏ స్టార్ తో షూటింగ్ చేశారో తెలుసుకుని వారిని సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండేలా సమాచారం ఇస్తున్నట్ తెలుస్తోంది. మరి ఈ మూవీ అసలే డిలే అవుతూ వస్తోంది. ఇప్పుడు సెట్ లో మరికొంత మంది కరోనా బారిన పడినా.. స్టార్ ఎవరైనా కరోనాతో ఇబ్బంది పడినా.. మూవీ అనుకున్న సమయానికి వచ్చే అవకాశం లేనట్టే అని చెప్పాలి. 

ఇక రీసెంట్‌గానే పొన్నియ‌న్ సెల్వ‌న్ టీజ‌ర్‌రిలీజ్ అయ్యి మంచి స్పందన సాధించింది. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్‌, కార్తి, త్రిష, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రభు.. ఇలా పాన్ ఇండియా స్టార్స్ చాలా మంది నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ కాబోతోంది.