Asianet News TeluguAsianet News Telugu

బ్రేక్ ఇస్తున్నా.. మళ్లీ వస్తా.. సోషల్ మీడియాకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గుడ్ బై...

ఊర మాస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్, ఈమధ్యే నిర్మాతగా కూడా మారిన ఈ యంగ్ స్టార్..తాజాగా ఓ ప్రకటన చేశారు. సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. 
 

Director Lokesh Kanagaraj Take a break From Social Media JMS
Author
First Published Dec 17, 2023, 7:02 AM IST

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీది ప్రత్యేక స్థానం. సౌత్ నుంచిఎందరో టాలెంటెడ్ డైరెక్టర్స్ వస్తున్నారు.వారు సౌత్ తో పాటు నార్త్లో కూడా సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ ను కూడా ఇంప్రెస్ చేస్తున్నారు. ఇక ఈక్రమంలతో తమిళనాట నుంచి పాన్ ఇండియాన్ ఆకర్శిస్తున్న దర్శకులలో లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు.   ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో.. ఈ సినిమాలు చాలు అతని రేంజ్ ఏంటో తెలియజేయడానికి. లోకనాయకుడు కమల్ హాసన్‌తో తీసిన విక్రమ్, దళపతి విజయ్‌ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లియో.. కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టుకున్నాయి. బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.

 వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ యంగ్ డైరెక్టర్ రీసెంట్ గా నిర్మాణ రంగంలోకి కూడా ఎంటర్ అయ్యాడు. అందులో కూడా సక్సెస్ అయ్యాడు లోకేష్. ఫైట్ క్లబ్ టైటిల్ తో అతను సమర్పణలో వచ్చినసినిమా సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం లోకేష్ తన సూపర్ హిట్ సినిమాలైన ఖైదీ, విక్రమ్ ,సినిమాలకు సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం లియో సక్సెను ఎంజాయ్ చేస్తున్నలోకేష్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తో తలైవా 171 ప్రాజెక్ట్ ను చేయబోతున్నాడు. ఈమూవీలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటించబోతున్నారు. రణ్ వీర్ సింగ్ ఆల్ మెస్ట్ ఫిక్స్ అవ్వగా.. షారుఖ్ ను కూడారంగంలోకి దించబోతున్నారట. 

 

ఇక తాజాగా లోకేష్ కనకగరాజ్ ఓ ప్రకటన చేశారు. తానుసోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్  కోసం పనిచేయాల్సి ఉండగా.. తాను సోషల్ మీడియాతో పాటు ఆకరుకి తన ఫోన్ కు కూడా బ్రేక్ ఇస్తున్నానని అన్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఆయన సోషల్ మీడియాలో ఓ నోట్ ను రిలీజ్ చేశారు. తన సమర్పణ వచ్చిన ఫైట్ క్లబ్ సినిమాను ఆదరించినందుకు సినీ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. తన మొట్టమొదటి ప్రయత్నంగా జీ స్క్వాడ్ బ్యానర్ కింద ఫైట్ క్లబ్‌ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించానని పేర్కొన్నాడు.

నా తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టడానికి అన్ని సోషల్ మీడియా నుండి విరామం తీసుకుంటున్నాను. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా అన్నింటినీ వదిలివేస్తోన్నానని, చివరికి సెల్ ఫోన్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదని తెలిపాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక గతంలో కూడా లోకేష్ ఇలాగే పలుమార్లు సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో తన మార్క్ స్టైల్ గా స్థిరపడిపోయింది. ఇక ఈ విషయంలో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios