Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతున లోకేష్ కనకరాజ్..? కారణం అదేనట..?

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతున్నారా... ? ఈనిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటీ..? ఆయన ఏ విషయంలోనైనా ఇబ్బంది పడ్డారా..? ఈ విషయంలో ఆయన చెప్పిన కారణం ఏంటి..? 

Director Lokesh Kanagaraj Good By To Social Media JMS
Author
First Published Oct 21, 2023, 1:51 PM IST | Last Updated Oct 21, 2023, 1:51 PM IST


తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతున్నారా... ? ఈనిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటీ..? ఆయన ఏ విషయంలోనైనా ఇబ్బంది పడ్డారా..? ఈ విషయంలో ఆయన చెప్పిన కారణం ఏంటి..? 

సోషల్ మీడియా విస్తృతం అయినప్పటి నుంచి సినిమావాళ్ల స్టార్ డమ్ ఇంకా పెరగడంతో పాటు.. వాళ్ల ఫాలోయింగ్ కూడా గట్టిగా విస్తరించింది. అయితే ఎంత స్టార్ డమ్ పెరిగినా.. ఎంత మంది అభిమానులు పెరిగినా.. అంతకంటే ఎక్కువగా ఇబ్బందులు కూడా తప్పడంలేదు స్టార్స్ కు. ఎందుకంటే అందరూ ఇష్టపడే వారే ఉండరు కదా..? సోషల్ మీడియాఅభిమానించే ఆప్షన్ ఉన్నట్టే.. విమర్షించే ఆప్షన్ కూడా ఉంది. అది కాస్తా ట్రోలింగ్ వైపు టర్న్ అయితే.. విమర్షలు ఘాటుగా ఫోర్స్ గా రావడం ఖాయం. దాంతో సోషల్ మీడియా అంటే కొంత మంది స్టార్స్ భయపడాల్సి వస్తోంది. 

ఈక్రమంలో చాలా మంది స్టార్స్ సోషల్ మీడియా సైట్స్ నుంచి క్విట్ అవుతున్నారు. కారణాలుఏవైనా.. సోషల్ మీడియాలో తమ అకౌంట్స్ కు బ్రేక్ ఇచ్చినవారు.. అసలుకే క్లోజ్ చేసిన వారి సంఖ్య ఈమధ్య పెరిగిపోతోంది. ఈక్రమంలో ఈ లిస్ట్ లో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడాచేరారు. తాజా సమాచారం ప్రకారం లోకేశ్‌ కనగరాజ్‌ సోషల్‌ మీడియా నుంచి తప్పుకోబోతున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో హల్ చల్ చేస్తోంది. దానికి కారణం కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు. ఓ డైరెక్టర్ సినిమా చేస్తే.. ఆ హీరో  అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు చిర్రెత్తుకొచ్చే ట్రోల్స్‌ కూడా చేస్తుంటారు. అదే అనుభవం లోకేష్ కు అయ్యిందట. 

 తాజా ఇంటర్వ్యూలో లోకేశ్ కనగరాజ్‌ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య యుద్దం నడుస్తోన్న సమయంలో తనపై చూపిస్తున్న ద్వేషం, ట్రోలింగ్స్‌ ను చూశాను. తమపై ఇతరులు చేస్తున్న విమర్షలకు తమనతో పాటు.. అభిమానులు కూడా  కలత చెందుతున్నానన్నారు. ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోల బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. కానీ ఇది అసభ్యంగా..  అసహ్యంగా మారుతుంది.. అంతేకాదు అభిమానులు వారి పోస్ట్‌లలో నన్ను ట్యాగ్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఇదంతా ఎందుకనిపిస్తోంది అన్నారు లోకేష్. 

నాకు రోజూ వేల సంఖ్యలో ఇలాంటి పోస్ట్‌లు వస్తుంటాయి, ట్యాగులు చేస్తుంటారు. అందేకే నేను సోషల్ మీడియా నుండి తప్పుకోవాలని ఆలోచిస్తున్నా. సినిమా అనేది రెండున్నారగంటల వినోదం మాత్రమే.. అది మీకు రిలీఫ్ ఇవ్వాలి.. టెన్షెన్స్ నుంచి దూరం చేయాలి.. కాని హీరోలు గ్రూప్ లు.. అంటూ.. ఇక్కడ కూడా మనశాంతి లేకుండా చేసుకుంటున్నారు. ఈ విషయాలను పర్సనల్ గా తీసుకుని.. ఎదుటివారిని శత్రువుల్లా భావించ వద్దు.  దీనిని ఓ యుద్ధంలా చేయడం మంచిది కాదు.. అసలు అది  సరైంది కాదు.. నాకు సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఉన్నా ఇప్పుడు పోయింది.. అని తన ఆవేదన వ్యక్తం చేశాడు లోకేశ్ కనగరాజ్‌.

దాంతో లోకేష్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ గా వెలుగు వెలుగుతున్నాడు లోకేశ్‌ కనగరాజ్‌. ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా.. దానిపై భారీ స్థాయిలో అంచనాలు  ఉంటాయని తెలిసిందే. ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌ దళపతి విజయ్ తో  యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లియో ను తెరకెక్కించారు. ఈ లియో సినిమా  అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios