లోకేష్ , అనిరుధ్ సాహసం, బిజీ థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసిన స్టార్స్
ఈరోజు ( అక్టోబర్ 19) విజయ్ నటించిన లియో సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి సందడి చేస్తుంది. ఈక్రమంలో ఈ సినిమా దర్శకుడు లోకేష్ నకగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ ఓ సాహసం చేశారు.

ఈరోజు ( అక్టోబర్ 19) విజయ్ నటించిన లియో సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి సందడి చేస్తుంది. ఈక్రమంలో ఈ సినిమా దర్శకుడు లోకేష్ నకగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ ఓ సాహసం చేశారు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay)నటించిన యాక్షన్ మూవీ లియో. (Leo..Bloody Sweet). త్రిష హీరోయిన్‌గా నటించిన ఈసినిమాను లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేశాడు. ఈరోజు ( అక్టోబర్ 19) ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా. దీంతో థియేటర్‌ల వద్ద ప్రేక్షకుల సందడి నెలకొన్నది. ఇక థియేటర్‌ల ముందు విజయ్ ఫ్యాన్స్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సామాన్యులకు ఈరోజు టికెట్లు దొరకడమే కష్టం. ఇక ఇంత రష్ లో సెలబ్రిటీలు థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం సాధ్యం అవుతుందా.. ఎవరైనా ఆ సాహసం చేస్తారా..?
కాని ఆ సాహసం చేశారు లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. తమిళనాడులో ఉదయం 9 గంటలకు షో స్టార్ట్ అవ్వడంతో అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వెట్రి థియేటర్‌కు అభిమానులతో కలిసి లియో సినిమా చూసేందుకు దర్శకుడు లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్, చిత్రబృందం వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లోకేశ్, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉండటంతో దాదాపు 34 దేశాలకుపైగా రిలీజ్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. అమెరికా, యూకే, దుబాయ్ ఇతర దేశాల్లో భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రూ.50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లను తొలి రోజు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తమిళనాడులో ‘లియో’ ఫస్ట్ డే ఫస్ట్ షోకు అనుమతి ఇవ్వలేమని.. ఉదయం 9 గంటల నుంచే స్క్రీనింగ్‌లకు అనుమతి ఇస్తామంటూ తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు మినహా కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలతో పాటు అమెరికా, సింగపూర్, మలేషియా సహా ఇతర దేశాల్లో తెల్లవారుజామున 4 గంటలకు లియో విడుదలైంది.