యజ్ఞం, వీరభద్ర, ఆటాడిస్తా, పిల్లా నువ్వు లేని జీవితం, సౌఖ్యం లాంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎఎస్ రవికుమార్ చౌదరి. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. కెమెరాముందే సిగరెట్ తాగుతూ, మధ్యలో మందు కూడా కొట్టి వచ్చి పలు షాకింగ్ విషయాలు బయట పెట్టారు.
తన ఒంటిపై ఉన్న పచ్చబొట్ల గురించి ప్రస్తావించగా...రవికుమార్ చౌదరి కాస్త ఎమోషనల్ అయ్యారు. ఒక వ్యభిచారిని ప్రేమించాను. ఆమె వ్యభిచారి అని తెలియకుండానే ప్రేమించాను. పేరు చెప్పమంటే చెప్పేస్తాను. బయపడేది లేదు. అప్పట్లో ఓ ప్రముఖ టీవీలో ఓ యాంకర్‌గా చేసేది అంటూ రవి కుమార్ చౌదరి తెలిపారు.


ఆ టైమ్‌లో ఫస్ట్ లవ్, ఇన్‌ఫాక్చువేషన్ లాంటిది...అపుడు తెలియలేదు. ఆమె కోసం రాత్రి 11 గంటలకు జూబ్లీ హిల్స్ నుండి నడుచుకుంటూ సోమాజిగూడ వెళ్లేవాడిని. నన్ను దాని నుండి బయట పడేయడానికి డైరెక్టర్ వినాయక్, సాగర్ ట్రై చేశారు. కానీ నేను వినిపించుకోలేదు అని రవికుమార్ తెలిపారు.ఆ దొంగ ము** ఏం చేసిదంటే... నన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి, మరో వ్యక్తితో మ్యారేజ్ అరేంజ్ చేసుకుంది. నాకు తెలిసింది. అపుడు ఫుల్‌గా మందు కొట్టేసి ఇంటికెళ్లి అల్లరల్లరి చేశాను అని రవి కుమార్ చౌదరి తెలిపారు.అపుడు నేను సీరియల్స్ చేస్తున్నాను. ఆమెను యాక్టింగ్ నుండి దారి మళ్లించి మంచి టెక్నీషియన్ చేద్దామనుకున్నాను. కథ, మాటలు అన్నీ నేనే రాసి, కోడైరెక్టర్ గా ఉంటూ డైరెక్టర్‌గా ఆమె పేరు వేశాను. కానీ నన్ను ప్రేమ విషయంలో అలా చేసింది అని రవి కుమార్ చౌదరి వెల్లడించారు.ఆమె పెళ్లయిపోయాక తన భర్తతో కలిసి దసపల్లా హోటల్ వచ్చింది. సరే అని చెప్పి రెండు దండలు తీసుకుని, ఓ బ్లేడు కూడా తీసుకుని వెళ్లాను. నా ముందే వారి దండలు మార్పించాను. బ్లేడుతో నా వేలు కట్ చేసి రక్తంతో అతడికి తిలకం దిద్దాను. నేను ప్రేమలో ఓడిపోయాను, నువ్వు గెలిచావు అని అతడితో చెప్పాను. తర్వాత బాధతో హైదరాబాద్ వదిలి వెళ్లిపోతూ రైల్వే స్టేషన్ వద్ద ఆమె పేరు నా ఒంటిపై పచ్చబొట్టు వేయించుకున్నాను. ఆమె అంటే అప్పట్లో అంత పిచ్చి ఉండేది... అని రవికుమార్ చౌదరి తెలిపారు.నాకు అందరు హీరోలంటే ఇష్టం, బాలయ్య అంటే ఎక్కువ ఇష్టం. యజ్ఞం తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ బాలయ్య బాబుతో చేయాలని ఫిక్స్ అయ్యాను. ఆయనతో అవకాశం వచ్చింది వీరభద్ర చేశాను. ఆయనతో హిట్ కొట్టలేదనే బాధ ఉంది. నేను మరో పది సక్సెస్ చిత్రాలు తీసినా ఆయనతో సక్సెస్ కొట్టే వరకు ఆ బాధ అలానే ఉంటుంది అని రవికుమార్ చౌదరి చెప్పుకొచ్చారు.