Asianet News TeluguAsianet News Telugu

రమ్య కృష్ణను చూస్తే కన్నీళ్ళు ఆగలేదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్ వైరల్

కృష్ణ వంశీ దర్శకత్వంలో  ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన సినిమా  రంగమార్తాండ. ఈసినిమా ఈనెల 22న ఉగాది సందర్భంగా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈక్రమంలో నిన్న ( ఆదివారం) ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీటీమ్. ఈసందర్భంగా డైరెక్టర్ కృష్ణ వంశీ మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

Director Krishna Vamsi Comments On Ramya Krishna
Author
First Published Mar 20, 2023, 8:23 AM IST

ఎప్పుడో 70 దశకంలో వచ్చిన మరాఠ నాటకాన్ని తిసుకుని...రీసెంట్ ఇయర్స్ లో నటసామ్రాట్ సినిమా చేశారు. ఆ సినిమాలో సోల్ తీసుకుని.. మనకు తగ్గట్టు.. ముఖ్యంగా ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు మార్చుకుని రంగమార్తాండ సినిమా తెరకెక్కించారు దర్శకుడు కృష్ణవంశీ. ఈ మూవీ రిలీజ్ కు ముస్తాబు అవ్వగా.. ప్రెస్ మీట్ పెట్టి... సినిమా విశేషాలు పంచుకున్నారు మూవీ టీమ్. ఈసందర్భంగా.. ఆస్కార్ స్టేజ్ పై  పెర్ఫామెన్స్ ఇచ్చిన రాహుల్ కు సన్మానం కూడాచేశారు టీమ్. ఇక కృష్ణ వంశీ మాట్లాడుతూ. కొన్ని సినిమాలకు అన్నీ కుదురుతాయి.. కొన్ని సినిమాలకు అసలు కుదరవు.. కాని ఈసినిమాకు అన్నీ పక్కాగా కుదిరాయి.  సినిమా చూసిన వాళ్ళు కూడా అదే అన్నారు. మాస్ సినిమాల జోరు సాగుతున్న టైమ్ లో.. శంకరాభరణం వచ్చి సూపర్ హిట్ అయ్యింది... సినిమాకు కథ బాగుంటే.. ఆడియన్స్ స్వీకరిస్తారు అనడానికి శంకరాభరణం ఒక ఉదాహరణ. అలాగే రంగమార్తాండ సినిమా  కథ కూడా ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది అన్నారు. 

ఇక ఈసినిమాలో రమ్య కృష్ణ పాత్ర గురించి మాట్లాడారు కృష్ణ వంశీ. సినిమాల్లో పెద్ద పెద్దగా అరుస్తావెందుకు అని నేను, నా కొడుకు రమ్యను అనేవాళ్ళం. ఈసినిమా కోసం ముందుగా రమ్య పాత్ర వేరేవాళ్ళను అనుకున్నా.. ఆమెకూడా కొన్ని పేర్లు చెప్పింది. కాని అది నువ్వే ఎందకు చేయకూడదు అంటూ.. రమ్యను రంగంలోకి దింపాము అన్నారు కృష్ణ వంశీ. అ పాత్ర కోసం తనే మేకప్ చేసుకుంది, తనే హెయిర్ స్టైల్ చేసుకుంది. ఇక ఎప్పుడూ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పే రమ్మ కృష్ణ ఈసినిమాలో కళ్ళతోనే హావభావాలు పలికిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో రమ్య నటన చూసి కన్నీళ్లు వచ్చాయి. ఆ క్లైమాక్స్ సీన్ 36 గంటలు తీశాను.. అంతలా నటించి మెప్పించింది రమ్యకృష్ణ కళ్ళు బాగుంటాయి అన్నారు కృష్ణ వంశీ. 

అంతే కాదు సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా మాతృక.. ఒక నాటకం..అది అన్నీ షేక్స్ స్పియర్ నాటకాల చుట్టూ తిరుగుతుంది. అయితే అది మన నాటకాలకు తగ్గట్టు మార్చుకున్నాను. ఇక ఈసినిమాలో నటించి ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాష అయినా.. ఆ భాష నటుడికంటే కూడా ఎక్కువ పట్ట ఉంటుంది ప్రకాశ్ కు. అటు బ్రహ్మానందంగారు కూడా తినకుండా.. తన సీన్స్ అయ్యే వరకూ ఓపిగ్గా చేసేవారు. తన ఫెసియల్ ఎక్స్ ప్రెషన్స్ తో  సీన్స్ పండించారు అన్నారు. 

ఇక రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. కృష్ణ వంశీ సార్ సినిమాలో నటించడం.. అదే సినిమాలో నటిస్తూ.. పాటలు పాడటం..అది కూడా ఇళయరాజా సార్ లాంటి పెద్దలు.. స్టార్స్ మ్యూజిక్ డైరెక్షన్ లో పాడటం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు రాహుల్.  ఇక రంగమార్తాండ సినిమా ఉగాది కానుకతా ఈనెల 22న రిలీజ్ కాబోతోంది. కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను  కాలీపు మధు నిర్మించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios