డైరెక్టర్ కృష్ణవంశీ హాట్ కామెంట్స్ చేశారు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై ఓ సినిమా ఫెయిల్యూర్ భారం మోపారు. ఇంతకీ కృష్ణ వంశీ ఏమన్నారంటే..?  

ఒకప్పుడు టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే వెంటనే వినిపించే పేరు కృష్ణవంశీ. ఆతరువాత కాలంలో ఆయన సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాచి. ఈమధ్య చాలా గ్యాప్ తీసుకున్న సీనియర్ దర్శకుడు రంగమార్నాండ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తున్నారు టీమ్. ఇక ఒక ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ మాట్లాడుతూ ప్రభాస్ తో చేసిన చక్రం మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

చక్రం సినిమా ఫెయిల్యూర్ విషయంలో ప్రభాస్ బాధ్యతను గుర్తు చేస్తూ.. కామెంట్స్ చేశారు. వర్షం సినిమా తర్వాత ప్రభాస్ కు మాస్ ఫ్యాన్స్ ఎక్కువయ్యారని, ఈ సందర్భంలోనే స్పిరుచువల్ పాయింట్ లో చక్రం సినిమా తీద్దామని కృష్ణవంశీ అడిగారట. అయితే వర్షం మూవీ హిట్ అయిన తర్వాత, ప్రభాస్ ను కృష్ణవంశీ కలిసినప్పుడు ప్రభాస్ కు రెండు కథలు చెప్పారట. అందులో ఒకటి చక్రం సినిమా.. రెండోది రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో ఫుల్ లెన్త్ యాక్షన్, ఫైట్స్, గుప్తనిధుల నేపథ్యంలో సాగే కథ. ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రభాస్ తో చేద్దామని కృష్ణవంశీ అనుకున్నారట. 

కానీ ఇందులో యాక్షన్ మూవీని ప్రభాస్ ఒప్పుకోలేదని తెలుస్తోంది . వర్షం సినిమా తర్వాత యాక్షన్ సినిమాలతోనే వస్తున్నారు కానీ.. పర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీ చేస్తే బాగుంటుందన్నారు. దీంతో చక్రం సినిమాకే ప్రభాస్ ఓకే చెప్పేశారట. ఇక ఈమూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి.. ప్రభాస్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ బాగా డిస్సపాయింట్ అయ్యారు. అందులోనూ క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరు ఉన్న కృష్ణ వంశీ నుంచి ఇలాంటి సినిమా ఏంటీ అంటూ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. 

ఈ విధంగా ఆ సమయంలో ప్రభాస్ యాక్షన్ సినిమా ఒప్పుకొని ఉంటే మాత్రం హైరేంజ్ లో ఇంకో విధంగా ఉండేదని కృష్ణ వంశీ అన్నారు. ఆ యాక్షన్ సినిమాతో ప్రభాస్ రేంజ్ అంతకు మించి అన్నట్టుగా ఇంకో రేంజ్ లో మారేదో.. లేదో.. ఇక ప్రస్తుతం కృష్ణ వంశీ ఎమోషనల్ డ్రామాగా రంగమార్తాండ మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ మూవీలో రమ్యకృష్ణ,ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్స్ చేస్తుండగా బ్రహ్మానందం, అనసూయ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రలో నటించారు.