Asianet News TeluguAsianet News Telugu

క్రిష్ నిర్మాతగా వరుణ్ తేజ్ మూవీ, డైరక్టర్ ఎవరంటే...?

ఈ సినిమాని రాజీవ్ రెడ్డి, క్రిష్ కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Director Krish to produce Varun Tej Next jsp
Author
First Published May 26, 2024, 3:09 PM IST

కంచె సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వరుణ్ తేజ్... మరోసారి అదే సినిమా దర్శకుడు క్రిష్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ సారి క్రిష్  ఈ ప్రాజెక్టుకు డైరక్టర్ కాదు కేవలం నిర్మాతనే. వీళ్లిద్దరి మధ్యా కంచె నాటి నుంచి మంచి బాండింగ్ ఉంది. అదే ఉత్సాహంతో వరుణ్ తేజ్ హీరోగా గతంలో అంతరిక్షం సినిమాని నిర్మించారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఓ కామెడీ సినిమా చేయటానికి రెడీ అవుతున్నారు. క్రిష్ నిర్మించే ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. ఓ కామెక్ ఎంటర్టైనర్ రూపొందించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాని రాజీవ్ రెడ్డి, క్రిష్ కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఫైనల్ స్క్రిప్టు లాక్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. ఆగస్ట్  లేదా సెప్టెంబర్ లలో సినిమా మొదలై వచ్చే ఏడు రిలీజ్ కు వస్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ సమ్మర్ బ్రేక్ లో ఉన్నాడు. ఆయన చేస్తున్న మట్కా సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది.  పీరియడ్ మాస్ ఎంటర్టైనర్ గా మట్కా ని రూపొందిస్తున్నారు.

మరో ప్రక్క వరుణ్‌ తేజ్‌ (varun Tej) , శేఖర్ కమ్ముల కాంబోకు రంగం రెడీ అవుతోంది. వరుణ్ తేజ్ కెరీర్‌ను టర్న్‌ చేసిన చిత్రం 'ఫిదా' (Fidaa). శేఖర్‌ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలవడమే కాక కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే వీరిద్దరి కాంబోలో  మరో చిత్రం రావాలని అభిమానులు చాలాకాలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు శేఖర్‌ కమ్ముల, వరుణ్‌ మళ్లీ కలిసి పని చేయబోతున్నారు. ఏ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని టాక్‌. వరుణ్‌ ప్రస్తుతం ‘మట్కా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. 

 శేఖర్‌ కమ్ముల ‘కుబేర’తో బిజీగా ఉన్నారు. అవి రెండూ పూర్తయ్యాకే ఈ కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతోందని సమాచారం. వరుణ్‌ కూడా శేఖర్‌ కమ్ములతో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మధ్యన వరుణ్‌ చేసిన సినిమా ఏదీ సరైన ఫలితం ఇవ్వలేదు.  వరుసగా ఫ్లాప్స్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘మట్కా’పైనే ఆశలు పెట్టుకొన్నాడు. శేఖర్‌ కమ్ముల కథ కూడా కొత్త జోనర్‌లో సాగబోతోందని తెలుస్తోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios