తన సినిమాల ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడమేకాదు.. ఆ సినిమాల్ని బ్లాక్ బస్టర్స్ గా నిలబెట్టడం కూడా దర్శకుడు కొరటాల శివకున్న దమ్ము. తన గత సినిమాలు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లలో శివ ఎలాంటి మెసేజ్ ఇచ్చారో… దాన్ని ఆడియన్స్ ఎలా తీసుకున్నారో కూడా అందరికీ తెలిసిందే. తాజాగా మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను సినిమా తెరకెక్కిస్తోన్న కొరటాల శివ ఒక సంచలన ప్రకటన చేశారు.

 

 

 

వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండే శివ సాక్షాత్తూ భారత ప్రధానిని నరేంద్రమోదీనే టార్గెట్ చేశారు.‘ఆంధ్రప్రదేశ్‌కు గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసి.. ఆయనను మనిషిగా మారుద్దాం.. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్..?’ అంటూ సరాసరి మోదీని ప్రశ్నించారు కొరటాల శివ. ఇటీవల రిలీజ్ అయిన తన ‘భరత్ అనే నేను’ టీజర్‌లో సీఎం పాత్రలో మహేష్ చెప్పిన డైలాగ్స్‌ను ప్రధానికి అన్వయిస్తూ తన ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో శివ పోస్ట్ పెట్టారు.

 

 

అటు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సైతం కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు. ఏపీ మీద సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ విమర్శించారు. ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలంగాణే  సపోర్ట్ చేస్తుంటే మీకేమైదంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు.