టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వీటీ అనుష్కకు హీరోల రేంజ్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 15ఏళ్లుగా అనుష్క టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతుంది. బెంగుళూరుకు చెందిన యోగ ట్రైనర్ అయిన అనుష్కను దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ గా పరిచయం చేశాడు. 2005లో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ మూవీతో అనుష్క హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యారు. 

ఐతే ఇంటర్ చదివే రోజుల్లోనే అనుష్కకు సినిమా ఆఫర్ వచ్చిందట. కన్నడ పరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకుడు కోడ్లు రామకృష్ణ అనుష్కకు సినిమా ఆఫర్ ఇచ్చారట. దీని వెనుక ఓ ఆసక్తికర స్టోరీ ఉంది. 2000లో కోడ్లు రామకృష్ణ 'హలో' మూవీ షూటింగ్ బెంగుళూరులో జరుపుతున్నారట. ఆ షూటింగ్ స్పాట్ కి రోజు అనుష్క వచ్చేవారట. అందరితో పాటు ఓ కార్నర్ లో నిల్చుని షూటింగ్ చేసేవారట. ఇది గమనించిన డైరెక్టర్ రామకృష్ణ అనుష్కను పిలిచి అడిగారట. నీకు ఆసక్తి ఉంటే సినిమా అవకాశం ఇస్తాను అన్నారట. 

ఆ సమయంలో ఇంటర్ చదువుతున్న అనుష్క లేదు సార్, నేను చదువుకోవాలని సమాధానం ఇచ్చిందట. ఇక సూపర్ మూవీ కోసం ఓ కొత్త అమ్మాయిని తీసుకోవాలని వెతుకుతున్న పూరికి అనుష్క తగలింది. ఆడిషన్స్ చేసి ఆమెను సూపర్ మూవీకి తీసుకోవడం జరిగింది. అనుష్క అసలు పేరు కూడా స్వీటీ అట. సూపర్ మూవీ కోసం ముంబై నుండి వచ్చిన ఓ లేడీ నామె అనుష్క కావడంతో, స్వీటీని అనుష్కగా మార్చేశారట.