దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వందకు పైగా సినిమాలు రూపొందించి దర్శకేంద్రుడిగా పేరుతెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ముఖ్యంగా కమర్షియల్‌ చిత్రాలకు ఆయన కేరాఫ్‌గా నిలిచారు. హీరోయిన్లని అందంగా చూపించడంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. దర్శకుడిగా సినిమాలు మానేశారు. ఇంకా చెప్పాలంటే నేటి తరానికి తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కించడంలో సఫలం కాలేకపోతున్నారు. చివరగా ఆయన తీసిన `ఓం నమో వెంకటేశాయా` చిత్రం పరాజయం చెందింది. 

ఇదిలా ఉంటే దర్శకుడు రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడిగా తెరపై కనిపించబోతున్నాడట. పాపులర్‌ చిత్రం `పెల్ళి సందడి` రీమేక్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. తనికెళ్ల భరణి దీనికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో కె.రాఘవేంద్రరావు నటుడిగా మారబోతున్నాడని తెలుస్తుంది. ఆయనతోపాటు రమ్యకృష్ణ, సమంత, శ్రియ నటించనున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మరి నిజమేంటనేది చూడాలి. మరి రాఘవేంద్రరావు దర్శకత్వాన్ని పూర్తిగా వదిలేసినట్టే అనే కామెంట్‌ వినిపిస్తుంది.