వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన చిత్రం 'వాల్మీకి'. తాజాగా ఈ సినిమాలోని 'ఎల్లువచ్చి గోదారమ్మ' సాంగ్ ప్రోమోని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాఘవేంద్రరావు మైక్ పట్టుకొని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

ముందుగా 'ఎల్లువచ్చి గోదారమ్మ' సాంగ్ ని రీమిక్స్ చేసి తనను పాతికేళ్ల వెనక్కి తీసుకెళ్లారని అన్నారు. అప్పటిరోజులు గుర్తుకు వస్తున్నాయని.. ఆ పాటను అప్పట్లో చాలా కష్టపడి చేశామని అన్నారు. పూజా హెగ్డేని మొదటిసారి చూసినప్పుడే టాప్ హీరోయిన్ అవుతుందని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.

తనకు చిన్న కోరిక ఉందని.. పూజా హెగ్డేని అడిగాడు. ఏం కావాలి సార్ అంటూ పూజా అమాయకంగా అడిగింది. అప్పుడు పక్కనే ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ ని ఇన్వాల్వ్ చేస్తూ.. 'పూజా హెగ్డే ఏ బిందెను అయితే నడుముపై పెట్టుకుందో ఆ బిందెను నాకు గిఫ్ట్ గా పంపిస్తావా..? అని అడిగారు. ఆయన అలా కోరడంతో స్టేజ్ పై ఉన్న పూజా తెగ నవ్వింది.

చుట్టూ ఉన్నవాళ్లు కూడా రాఘవేంద్రరావు చిలిపి కోరిక విని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఇక ఆయన్ని హరీష్ శంకర్.. పూజను చూస్తే మీకు ఏ పండుతో కొట్టాలనిపిస్తుందని  అడగగా.. దానికి వెంటనే చెర్రీ అని సమాధానం చెప్పాడు రాఘవేంద్రరావు.