ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సోదరుడు, నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన్‌రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సోదరుడు, నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన్‌రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కృష్ణ మోహన్‌రావు మరణించారు. అయితే ఆయన అనారోగ్య కారణంగా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల ఇంటికి చేరుకున్నారు. అంతలోనే ఆయన మరణించడంతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంట్లో విషాదం నెలకొంది. 

కృష్ణమోహన్‌రావుకి ఇద్దరు కుమార్తెలు.ఒకరు `బాహుబలి` నిర్మాత శోభు యార్లగడ్డ భార్య లక్ష్మీ. మరొకరు లత ఉన్నారు. రేపు(గురువారం) ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే రాఘవేంద్రరావుకి చెందిన ఆర్‌కె.ఫిల్మ్స్ వ్యవస్థాపకులు కృష్ణమోహన్‌రావు కావడం విశేషం. దీనిపై అనేక సినిమాలు నిర్మించారు.