చిత్ర పరిశ్రమలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కోలీవుడ్ లో డైరెక్టర్ హరి స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నారు. ముఖ్యంగా ఆయన సూర్యతో తెరకెక్కించిన సింగం సిరీస్ కి మాత్రం సౌత్ లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది.

ఇప్పటివరకు సింగం సిరీస్ లో మూడు చిత్రాలు వచ్చాయి. సింగం 4 కి కూడా సన్నాహకాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే డైరెక్టర్ హరి ఇంట్లో నేడు విషాదకరం సంఘటన చోటు చేసుకుంది. డైరెక్టర్ హరికి పితృ వియోగం కలిగింది.
డైరెక్టర్ హరి తండ్రి విఏ గోపాలకృష్ణన్ నేడు చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా గోపాలకృష్ణన్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో ఆయనకి చికిత్స జరుగుతోంది. అయితే నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా గోపాలకృష్ణన్ స్వగ్రామం టుటికోరిన్ జిల్లాలోని కాచనవెళ్లి. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారట. తండ్రిని కోల్పోయిన డైరెక్టర్ హరికి కోలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతల నుంచి సానుభూతి వ్యక్తం అవుతోంది.
డైరెక్టర్ హరితో వర్క్ చేసిన నటులు, ఇతర టెక్నీషియన్స్ అందరూ సంతాపం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గోపాల కృష్ణన్ కి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ప్రస్తుతం హరి.. విశాల్ హీరోగా ఓ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.