Asianet News TeluguAsianet News Telugu

నయీం రాక్షసుడిగా మారింది అందుకే, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. 'నయీం డైరీస్' దర్శకుడు

2016లో గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ ఎంతటి సంచలనం సృటించిందో అందరికీ తెలిసిందే. పక్కా ప్రణాళికతో పోలీసులు నయీంని అంతం చేశారు.  నయీం మృతి తర్వాత అతడి నేరాల చిట్టా బయటకు వచ్చి అందరిని విస్మయానికి గురిచేసింది.

Director Damu Balaji interesting comments on Nayeem Diaries
Author
Hyderabad, First Published Dec 8, 2021, 7:31 PM IST

2016లో గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ ఎంతటి సంచలనం సృటించిందో అందరికీ తెలిసిందే. పక్కా ప్రణాళికతో పోలీసులు నయీంని అంతం చేశారు.  నయీం మృతి తర్వాత అతడి నేరాల చిట్టా బయటకు వచ్చి అందరిని విస్మయానికి గురిచేసింది. అతడి జీవిత కథతో  'నయీం డైరీస్'(Nayeem Diaries) అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో వశిష్ఠ సింహ నయీం క్యారెక్టర్ లో నటించారు. సీఏ వరదరాజు నిర్మాణంలో తన తొలి ప్రయత్నంగా నయీం డైరీస్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు దాము బాలాజీ. ఈ నెల 10న నయీం డైరీస్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు దర్శకుడు దాము బాలాజీ.

దర్శకుడు దాము బాలాజీ మాట్లాడుతూ... నయీం జీవిత కథతో రామ్ గోపాల్ వర్మ సినిమా చేయాలని అనుకుని కథ రాసే బాధ్యత నాకు అప్పగించారు. ఆ తర్వాత వర్మ ఆ సినిమా చేయలేదు. చాలా  రీసెర్చ్ చేసిన ఈ కథ తయారు చేసినప్పుడు ఎగ్జైట్ అయ్యి, ఈ సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుంది అనిపించింది. నా మిత్రుడైన వరదరాజు నిర్మాణంలో నయీం డైరీస్ సినిమా అలా ప్రారంభించాము. నయీం క్యారెక్టర్ లో నటించే వ్యక్తి అతని వ్యక్తిత్వాన్ని చూపించాలి గానీ ఇమిటేట్ చేయకూడదు అని అలోచించి వశిష్ట సింహాను సెలెక్ట్ చేసుకున్నాం.  

వశిష్ట లీడ్ రోల్ లో చక్కగా నటించాడు. నయీం మంచి వాడని ఈ సినిమాలో ఎక్కడా చూపించడం లేదు. పోలీసులు, నక్సలైట్ లు, రాజకీయ నాయకులు చేసిన తప్పులతో నయీం నేరస్తుడిగా మారాల్సి వచ్చింది. ఈ మూడు వ్యవస్థల మధ్య నయీం పొరపాట్లు చేసి దుర్మార్గుడిలా తయారయ్యాడు. నయీం డైరీస్ ను మూడు పార్టులుగా చేద్దామని కొందరు సూచించారు. అలా అయితే ఎప్పటికీ తేలే వ్యవహారం కాదని ఒకే చిత్రంగా చేశాం. ఎందుకంటే నయీం జీవితాన్ని కరెక్ట్ గా తీస్తే వెయ్యి సీన్స్ చేయొచ్చు.

నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య భీకరమైన పోరు జరుగుతున్న టైమ్ లో పోలీసులు నయీంను ఇన్ ఫార్మర్ గా వాడుకున్నారు. తాను ప్రేమించిన సోదరికి జరిగిన అన్యాయంతో నయీం రాక్షసుడిగా మారాడు. నయీం ఎన్ కౌంటర్ లో పోలీసులు చెప్పిన వెర్షన్ మాత్రమే మీడియా ప్రజలకు చూపించింది. కానీ అసలు జరిగింది వేరు. నేను నయీం డైరీస్ ద్వారా ఆ తెలియని చాలా విషయాలు చూపించబోతున్నాను. ఇప్పటికే నాకు ఈ సినిమా విషయంలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నయీం డైరీస్ తర్వాత మరికొన్ని నక్సలైట్ కథలు తెరకెక్కించాలని అనుకుంటున్నాను అని అన్నారు.  

Also Read: డైరెక్టర్ తో ఎఫైర్.. రెండో పెళ్ళికి రెడీ అవుతున్న 7/G బృందావన కాలనీ హీరోయిన్ ?

Follow Us:
Download App:
  • android
  • ios