అల్లరి నరేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదైనా ఉందా అంటే అది సుడిగాడు ఒక్కటే అని చెప్పాలి. 2012లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా దాదాపు 15కోట్ల కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క టిక్కెట్టు పై 100 సినిమాలు అనే కాన్సెప్ట్ తో చిత్ర యూనిట్ పడిన కష్టానికి ఫలితం దక్కింది. 

అయితే మరోసారి అలంటి హిట్ ఫార్ములతో సుడిగాడు కథకు సీక్వెల్ తీయాలని ఆడియెన్స్ ఎప్పటినుంచొ కోరుకుంటున్నారు. ఇక దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సీక్వెల్ పై స్పందించాడు. సుడిగాడు చాలా మంచి కాన్సెప్ట్ అని వీలైనంత త్వరగా సీక్వెల్ ప్లాన్ చేసేందుకు మంచి కథను రెడీ చేస్తామని తెలిపారు. 

దీంతో సుడిగాడు 2 కథ పట్టాలెక్కడానికి ఎంతో సమయం లేదని చెప్పవచ్చు. అల్లరి నరేష్ సుడిగాడు సినిమా తరువాత మరో సక్సెస్ అందుకోలేదు. అలాగే భీమనేని శ్రీనివాసరావు కూడా వరుస అపజయాలతో సతమతమవుతున్నారు. రీసెంట్ గా వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి కూడా అనుకున్నంతగా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయింది. మరి ఈ కాంబో సుడిగాడు 2తో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.