బాలా డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం వణంగాన్‌. ఇందులో అరుణ్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్నాడు. 

సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాల‌కు కేరాఫ్ ఎడ్రస్ ద‌ర్శ‌కుడు బాలా. ఆయన డైరక్షన్ లో వచ్చిన అనేక సినిమాలు తెలుగులోనూ మంచి సక్సెస్ ని సాధించాయి. ‘నందా’, ‘శివ‌పుత్రుడు’,సేతు, నేనే దేవుడ్ని, వాడేవీడు వంటి క‌మ‌ర్షియ‌ల్‌గానూ స‌క్సెస్ అవటమే కాకుండా విమ‌ర్శ‌కుల నుంచి గొప్ప ప్ర‌శంస‌లు అందుకున్నాయి. ఈ సినిమాల్లో నటించిన హీరోలకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే ఆయన గత కొద్దికాలంగా గ్యాప్ తీసుకుని సినిమా చేసారు. 

తన కెరీర్ ప్రారంభంలో హిట్ ఇచ్చిన సూర్యతో కలిసి 18ఏళ్ళ త‌ర్వాత వీరిద్దరూ క‌లిసి ‘అచలుడు’ అనే చిత్రాన్ని మొదటలెట్టారు. 40శాతం షూటింగ్‌ కూడా పూర్తయింది. కాగా తాజాగా ఈ సినిమా నుండి సూర్య తప్పుకున్నట్లు దర్శకుడు బాలా ప్రకటించాడు. సూర్య ఈ సినిమా నుండి తప్పుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ క్రమంలో బాలా సోషల్‌ మీడియాలో ఓ లేఖను పోస్ట్‌ చేశాడు. 

ఆ లేఖలో దర్శకుడు బాలా.. అచలుడు కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని, దాంతో ఈ సినిమా కథ సూర్యకు సరిపోదని అనిపించినట్లు బాలా తెలిపాడు. పరస్పర అంగీకారంతోనే సూర్య ఈ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. సూర్యకు కూడా ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బాలా లెటర్‌లో తెలిపాడు. అయితే సూర్య తప్పుకున్నా ఈ సినిమా మాత్రం కొనసాగుతుందని అన్నాడు.ఆ తర్వాత ఇప్పుడు బాలా మరో సినిమా చేస్తూ ఆ టీజర్ ని వదిలారు. 

 బాలా డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం వణంగాన్‌. ఇందులో అరుణ్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్నాడు. తొలుత ఈ చిత్రంలో నటించిన హీరో సూర్యతో దర్శకుడికి విభేదాలు ఏర్పడడంతో ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగారు. ఆ తర్వాత సూర్య పాత్రలో అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. ఇందులో రోషిని ప్రకాశ్‌, సముద్రఖని, మిష్కిన్‌ వంటి ప్రముఖులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గతేడాది వణంగాన్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయగా ఇందులో శరీరమంతా బురదతో కనిపించిన అరుణ్‌ విజయ్‌ ఒక చేతిలో పెరియార్‌, మరో చేతిలో వినాయకుడి విగ్రహాలతో ఆవేశంగా కనిపించాడు. ఆ పోస్టర్‌ తెగ వైరలయింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. టీజర్ సైతం వైరల్ అవుతోంది. 

YouTube video player

కన్యాకుమారి సముద్ర తీరంలోని తిరువళ్లువర్‌ విగ్రహ విశ్వరూపంతో టీజర్‌ ప్రారంభమవుతుంది. దేవాలయం వెనుకవైపు బైక్‌పై నుదుట విభూది, కుంకుమతో అరుణ్‌ విజయ్‌ కనిపిస్తున్నారు. బావిలో నుంచి ఓ చేతితో పెరియార్‌, మరో చేతిలో వినాయకుడితో పైకి వస్తున్న అరుణ్‌ విజయ్‌ సీన్‌ ఆకట్టుకుంటోంది.