బాలయ్యతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్.. మళ్లీ ఫ్యాక్షన్
గోపీచంద్ నటించిన `సీటీమార్` సినిమా సక్సెస్ కావడంతో ఆ ఊపులో `ఆరడుగుల బుల్లెట్` చిత్రాన్ని విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 8న సినిమా థియేటర్లో రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు బి.గోపాల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఎంతటి సంచలన విజయాలు సాధించాయో తెలిసిందే. `లారీ డ్రైవర్`, `రౌడీ ఇన్‌స్పెక్టర్`, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` చిత్రాలు మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్లుగా సిల్వర్ స్ర్కీన్‌ని షేక్ చేశాయి. `పల్నాటి బ్రహ్మనాయుడు` సినిమా ఆశించిన రిజల్ట్ నివ్వలేదు. ఫ్యాక్షన్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ దర్శకడు బి.గోపాల్. అనేక విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ పేజ్‌ని రాసుకున్నారు.
తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఆరడుగుల బుల్లెట్`. గోపీచంద్, నయనతార నటించిన చిత్రమిది. గత ఐదారేళ్ల క్రితమే ఈ సినిమా పూర్తయినా అనేక కారణాలతో వాయిదాపడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధమవుతుంది. ఇటీవల గోపీచంద్ నటించిన `సీటీమార్` సినిమా సక్సెస్ కావడంతో ఆ ఊపులో aaradugula bullet చిత్రాన్ని విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 8న సినిమా థియేటర్లో రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు b.gopal పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాలయ్యతో సినిమా ఉంటుందని చెప్పారు.
గతంలో balakrishna, బి.గోపాల్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని వార్తలు వినిపించాయి. ఆల్మోస్ట్ కన్ఫమ్ అన్నారు. దీనిపై ఆయన స్పందించారు. బాలయ్యతో సినిమా కమిట్‌మెంట్ ఉందని చెప్పారు. బాలయ్య బాబు ఒప్పుకున్నారని, కానీ స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నామన్నారు. బెల్లంకొండ సురేష్ బ్యానర్‌లో ఓ సినిమా అనుకున్నామని, కానీ అది వర్కౌట్ కాలేదన్నారు. ఇప్పుడు కథలు వింటున్నట్టు చెప్పారు. మంచి ఫ్యాక్షన్ కథ వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పారు. చిన్నికృష్ణ, సాయిమాధవ్ బుర్రా కథలు వినిపిస్తున్నారని, వాటిని డెవలప్ చేసే పనిలో ఉన్నారని తెలిపారు. కథ కారణంగానే సినిమా ఆలస్యమవుతుందన్నారు.
తాను స్వతహాగా కథలు రాసుకోలేనని స్పష్టం చేశారు. తాను రైటర్‌ని కాదని, ఇతర రైటర్స్ స్క్రిప్ట్ ల మీదే ఆధారపడాల్సి వస్తుందన్నారు. అందువల్లే తాను సినిమాలు 1985లో ఇండస్ట్రీలోకి వచ్చినా ఇప్పటి వరకు 35 సినిమాలే చేశానని చెప్పారు. కథ నచ్చితేనే సినిమా చేస్తానని, లేదంటూ అస్సలు చేయనని స్పష్టం చేశారు. అందుకే తనకు గ్యాప్ వస్తుందన్నారు. కొత్త రైటర్స్ ని పరిచయం చేయడంలో తాను ముందుంటానని, ఇటీవల అంతగా ఆఫర్లు రావడం లేదన్నారు.
also read: రిలీజ్ డేట్ ప్రకటన..గోపిచంద్ ని టెన్షన్ లో పడేసిందిట
gopichandతో చేసిన `ఆరడుగుల బుల్లెట్` చిత్రం గురించి చెబుతూ, తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ ఇదని, ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. ఆ తండ్రి కొడుకును ఎంతలా అపార్ఠం చేసుకున్నాడు.. ఎంతలా మిస్ అయ్యాడు.. ఆ ఫ్యామిలీని అతను ఎలా కాపాడాడు అనేదే కథ అన్నారు. పూర్తి స్థాయి యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని నేటి ఆడియెన్స్ కి కూడా బాగా నచ్చుతుందన్నారు. అయితే సినిమా ఏదైనా అందులోని కంటెంట్, ఎమోషన్ నచ్చితే సినిమా ఆడుతుందన్నారు.