సౌత్ క్రేజీ దర్శకుల్లో ఒకరైన అట్లీ ప్రస్తుతం తన కెరీర్ లో అతి పెద్ద ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ తో అట్లీ 'జవాన్' చిత్రం తెరకెక్కిస్తున్నారు. తేరి, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో అట్లీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.
సౌత్ క్రేజీ దర్శకుల్లో ఒకరైన అట్లీ ప్రస్తుతం తన కెరీర్ లో అతి పెద్ద ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ తో అట్లీ 'జవాన్' చిత్రం తెరకెక్కిస్తున్నారు. తేరి, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో అట్లీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ వసూళ్ళలో బాహుబలి 2నే అధికమించి అతిపెద్ద విజయంగా అవతరించింది.
దీనితో జవాన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తాడని కొన్ని రోజులుగా న్యూస్ వైరల్ అయింది. ఈ పాత్ర కోసం అట్లీ అల్లు అర్జున్ ని సంప్రాదించాడట. మొదట అల్లు అర్జున్ ఈ చిత్రంపై ఆసక్తి చూపారట. కానీ తాజాగా బన్నీ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ జవాన్ లో నటించాలంటే లుక్ మారాలి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది కాబట్టి మరో 8 నెలల వరకు బన్నీ లుక్ మారే పరిస్థితి లేదు. గడ్డం లుక్ లోనే ఉండాలి. లుక్ మార్చడం కుదరకపోవడంతో బన్నీ అట్లీకి నో చెప్పినట్లు తెలుస్తోంది.
దీనితో అట్లీ చూపు రాంచరణ్ పై పడినట్లు సమాచారం. రాంచరణ్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్స్ కోసం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. చరణ్ యుఎస్ నుంచి తిరిగిరాగానే అట్లీ సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా క్రేజీ పాత్ర బన్నీ నుంచి రాంచరణ్ కి చేతులు మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే పాత్రని తమిళంలో దళపతి విజయ్ పోషిస్తాడట. మరి అట్లీకి చరణ్ నో చెబుతాడో యస్ అంటాడా వేచి చూడాలి.
