`జవాన్`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దర్శకుడు అట్లీ. ఇప్పుడు బన్నీతో సినిమా చేయబోతున్నారు. దీనికి రికార్డు బ్రేకింగ్ పారితోషికం డిమాండ్ చేస్తున్నారట.
అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప2`తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. ఈ మూవీపైనే అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సారి బన్నీ పాన్ ఇండియా మార్కెట్‌ని మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్‌ని టార్గెట్ చేశాడు. `పుష్ప`లోనూ బన్నీ మ్యానరిజమ్స్, సాంగ్ ఇతర దేశాల ఆడియెన్స్ ని సైతం ఆకట్టుకోవడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఆ రేంజ్‌లోనే దర్శకుడు సుకుమార్ సినిమాని రూపొందిస్తున్నారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాలపై ఆసక్తికర అప్ డేట్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో పెద్ద కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. బన్నీ లైనప్‌లో ప్రధానంగా నాలుగు సినిమాలున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమాని అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు `యానిమల్` తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగాతో సినిమాని ప్రకటించారు.
దీంతోపాటు బోయపాటి శ్రీనుతో సినిమా చేసే కమిట్‌మెంట్ ఉంది. ఈ మూవీకి ప్లాన్ జరుగుతుందట. మరోవైపు తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయబోతున్నారని అంటున్నారు. అయితే బన్నీ నెక్ట్స్ మూవీ అట్లీతోనే ఉంటుందని లేటెస్ట్ ఇన్‌ఫర్మేషన్. అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో అదే చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందట, ఫైనల్ స్టేజ్ ఉందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే అట్లీ చివరగా షారూఖ్ ఖాన్ తో `జవాన్`సినిమాని రూపొందించారు. ఇది బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. వెయ్యి కోట్లు వసూలు చేసింది. ఈ మూవీతో దర్శకుడిగా తన సత్తా చాటాడు అట్లీ. దీంతో ఇప్పుడు ఆయనకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌కి తగ్గట్టుగానే పారితోషికం పెంచేస్తున్నాడట. నెక్ట్స్ మూవీకి ఆయన భారీగా డిమాండ్స్ చేస్తున్నారని సమాచారం. బన్నీతో తీయబోయే సినిమాకి ఓం రేంజ్‌లో అడుగుతున్నాడట. ఏకంగా 60కోట్ల పారితోషికం కోట్ చేస్తున్నారట. `జవాన్` హిట్ తో ఆయన ఈ మేరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
ఇదే నిజమైతే కోలీవుడ్‌లోనే ఇది అత్యధిక పారితోషికం కాబోతుంది. మరే ఇతర దర్శకులు కూడా ఈ రేంజ్‌లో తీసుకోవడం లేదు. శంకర్‌తో సహా. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఈ మూవీ `పుష్ప2` రిలీజ్ అయ్యాక ప్రారంభమవుతుందని తెలుస్తుంది.
