దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి ఇటీవల హీరోయిన్ మన్నారా చోప్రాను ముద్దుపెట్టుకున్నాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన స్పందించారు.  

యజ్ఞం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఏ ఎస్ రవికుమార్ చౌదరి(AS Ravikumar Chowdary)కి తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. బాలయ్యతో వీరభద్ర చేయగా అది అట్టర్ ప్లాప్ అయింది. సౌఖ్యం, పిల్లా నువ్వు లేని జీవితం ఆశించిన స్థాయిలో ఆడలేదు. చాలా గ్యాప్ తీసుకుని 'తిరగబడరా సామీ' టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కించారు. రాజ్ తరుణ్ హీరోగా నటించారు. ఇటీవల 'తిరగబడరా సామీ' చిత్ర టీజర్ విడుదల చేశారు. 

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. తిరగబడరా సామీ మూవీలో మన్నారా చోప్రా కీలక రోల్ చేయగా, ఆమె కూడా హాజరయ్యారు. ప్రెస్ ఎదుట రవికుమార్ చౌదరి మన్నారా చోప్రా(Mannara Chopra)తో సన్నిహితంగా వ్యవహరించారు. దగ్గరకు తీసుకుని ఆమెను ముద్దాడారు. మన్నారా సిగ్గుతో నవ్వుతూ పక్కకు వెళ్లారు. పబ్లిక్ లో ఏ ఎస్ రవికుమార్ హీరోయిన్ కి ముద్దు పెట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలకు ఘాటైన సమాధానం చెప్పిన రవికుమార్, తన చర్యలను సమర్ధించుకున్నారు. 

Scroll to load tweet…

'అసలు మన్నారా చోప్రాకు ముద్దు పెడితే తప్పేంటి. నేనేమైనా కసిగా ముద్దు పెట్టానా?. నా కూతురిని కూడా అలానే ముద్దాడతాను. ఆప్యాయతతో ముద్దు పెట్టుకున్నాను. మన్నారాకు, నా భార్యకు లేని నొప్పి మీకెందుకు. ఆమె నా చిత్రానికి బాగా కష్టపడింది. అందుకే ముద్దు పెట్టుకున్నాను...' అని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. రవికుమార్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

గతంలో ఏఎస్ రవికుమార్ పై నిర్మాత అంబికా కృష్ణ షాకింగ్ ఆరోపణలు చేశారు. వీరభద్ర సినిమాకు అంబికా కృష్ణ నిర్మాత కాగా... రవికుమార్ చౌదరి తాగి సెట్స్ కి వచ్చేవాడన్నాడు. ఇష్టం వచ్చినట్లు సినిమా తీసి బడ్జెట్ పెంచేశాడని అన్నారు. రవికుమార్ వలనే వీరభద్ర మూవీ ప్లాప్ అయ్యిందని అంబికా కృష్ణ అన్నారు. అంబికా కృష్ణ ఆరోపణలను రవికుమార్ చౌదరి ఖండించారు. నేను తాగి సెట్స్ కి వస్తే బాలకృష్ణ ఊరుకుంటారా? అని ఫైర్ అయ్యారు. 

Scroll to load tweet…