వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు అనీల్ రావిపూడి. 'పటాస్', 'సుప్రీం', 'రాజా ది గ్రేట్' లతో విజయాలను అందుకున్న ఈ దర్శకుడు ఈ ఏడాదిలో 'ఎఫ్ 2'తో పెద్ద సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల షేర్ ని సాధించింది. ఈ సినిమాతో అనీల్ రావిపూడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అనీల్.

ఈ సినిమా కోసం అతడు ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడో తెలుసా..? రూ.12 కోట్లు. నిర్మాతలు కూడా అనీల్ అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులు  సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల వంటి వారు రెమ్యునరేషన్ గా పది నుండి పదిహేను కోట్లు తీసుకుంటూ ఉంటారు.

ఇప్పుడు అనీల్ కూడా ఆ క్లబ్ లో చేరిపోయాడు. త్వరలోనే సినిమాకి వచ్చిన లాభాల్లో వాటా తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం అనీల్ రావిపూడి.. మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నాడు. ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.