బాలకృష్ణతో, మహేష్‌బాబులతో ఆయన సినిమాలు చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ప్రాక్టికల్‌గా ఇద్దరు హీరోలు వేరే దర్శకులతో సినిమాలు ప్రకటిస్తున్నారు. దీంతో అనిల్ రావిపూడితో సినిమాలు ఉంటాయా? లేదా? అన్నది సస్పెన్స్ నెలకొంది.
కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తన నెక్ట్స్ సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. బాలకృష్ణతో, మహేష్‌బాబులతో ఆయన సినిమాలు చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ప్రాక్టికల్‌గా ఇద్దరు హీరోలు వేరే దర్శకులతో సినిమాలు ప్రకటిస్తున్నారు. దీంతో అనిల్ రావిపూడితో సినిమాలు ఉంటాయా? లేదా? అన్నది సస్పెన్స్ నెలకొంది. దీనిపై తాజాగా దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంటర్య్వూలో దర్శకుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం వెంకీ, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిస్తున్న `ఎఫ్3`పై ఫోకస్ పెట్టాడట. ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యిందని చెప్పాడు.
బాలకృష్ణతో ఓ డిఫరెంట్ జోనర్ సినిమా చేయబోతున్నట్టు చెప్పారు. ఓ రకంగా బాలయ్యతో ప్రయోగం చేయబోతున్నాడని చెప్పొచ్చు. కాకపోతే అది మల్టీస్టారర్ సినిమా కాదని తెలిపారు. ఇక మహేష్‌తో సినిమా గురించి చెబుతూ, మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందే సినిమా పూర్తయిన తర్వాత తన సినిమా ఉంటుందన్నారు. అయితే అది `సరిలేరు నీకెవ్వరు` కి సీక్వెల్ కాదని, కొత్త కథ అని చెప్పారు. రవితేజతో `రాజాది గ్రేట్` సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచన కూడా ఉందని చెప్పారు. `ఎఫ్3` తర్వాత చేయబోయే సినిమా గురించి మున్ముందు వెల్లడిస్తానని తెలిపారు.
ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న `ఎఫ్3` సినిమా మూడేళ్ల క్రితం వచ్చిన `ఎఫ్2`కి సీక్వెల్. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మనీ ప్రధానంగా పుట్టే ఫ్రస్టేషన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇక ఇటీవల అనిల్‌రావిపూడికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకున్నారు.
