Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్: దిల్ రాజు కు రివర్స్ రిజల్ట్ లు, ఆనందపడాలా, బాధపడాలా?

డిస్ట్రిబ్యూషన్ చేయటం నిజంగా చాలా నరకం. డిస్ట్రిబ్యూషన్ లో వచ్చే ప్రాఫిట్ ల కంటే లాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. 

Dilraju wit in analysing Boxoffice result
Author
First Published Apr 27, 2023, 11:16 AM IST


దిల్ రాజు నిర్మాతగానూ, డిస్ట్రిబ్యూటర్ గానూ పెద్ద పేరుంది.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నిర్మాతలలో దిల్ రాజు ఒకరనేది కాదనలేని సత్యం. అలాగే  నైజాంలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా పేరు తెచ్చుకున్న దిల్ రాజు క్యాలిక్యులేషన్స్ ఈమధ్య విభిన్నంగానే ఉంటున్నాయి. వాటి రిజల్ట్ లు సైతం చాలా ఆశ్చర్యంగా ఉంటున్నాయి. దిల్ రాజు సక్సెస్ ని ఎలా లెక్కేయాలో ట్రేడ్ కు అర్దం కాని విధంగా ఉంటోంది. అంతా రివర్స్ లో ఉంటోంది. తాను ఎంతో నమ్మి నిర్మించన చిత్రాలు బోల్తా కొడుతున్నాయి. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు హై సక్సెస్ అవుతున్నాయి.  

 క్రితం సంవత్సరం తాను ఎంతగానో నమ్మి నాగచైతన్యతో  నిర్మించిన  #ThankYou సినిమా భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. సరిగ్గా అదే సమయంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన  #Bimbisara చిత్రం హై సక్సెస్ అయ్యింది. ఇలా జరిగిందేంటి అని అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి సీన్ రిపీట్ అయ్యింది. ఆయన ప్రొడక్షన్ వెంచర్ సమంత తో చేసిన  #Shaakuntalam భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యంది. అయితే వెంటనే డిస్ట్రిబ్యూటర్ చేసిన సాయి ధరమ్ తేజ #Virupaksha భీబత్సమైన లాభాలు తెచ్చి పెట్టి దిల్ రాజు కు ఆనందం కలిగిస్తోంది. ఇది విచిత్రంగా అనిపించింది.

సినిమా నిర్మించడం కంటే డిస్టిబ్యూషన్ చేయటం చాలా కష్టమని అన్న దిల్ రాజు రెండిటిలో ఉండే ప్రాఫిట్ మరియు లాస్ట్ పర్సంటేజ్ ల గురించి చెప్తూ... "డిస్ట్రిబ్యూషన్ చేయటం నిజంగా చాలా నరకం. డిస్ట్రిబ్యూషన్ లో వచ్చే ప్రాఫిట్ ల కంటే లాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం స్పైడర్ మరియు అజ్ఞాతవాసి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల నాకు కలిగిన నష్టం 25 కోట్లు. కానీ బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ 10 కోట్లు మాత్రమే," అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. అయినా ఒకవైపు సినిమా నిర్మాణం చేస్తూనే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తానని అంటున్నారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న "గేమ్ చేంజర్" సినిమాలు నిర్మిస్తున్నారు. అఖిల్ ఏజెంట్ ని , మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ 2  ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios